టాలీవుడ్సినిమా

పాపం.. తన కోరికను ఎలా తీర్చుకుంటుందో ?

Ileana Dream

ఇలియానా నడుముకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడంటే.. ఇలియానాకి క్రేజ్ లేదు గానీ, అప్పట్లో సౌత్ ప్రేక్షకులను.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షుకులను ఉర్రుతలూగించిన గ్లామర్ హీరోయిన్స్ లో.. ముందు వరుసలో నిలిచే పేరు ‘ఇలియానా’ది. తనదైన గ్లామర్ తో ఇప్పటికీ కేక పుట్టిస్తోన్న ఈ గోవా సుందరికి ఒక తీరని కోరిక ఉంది. ముంబై సముద్రపు ఒడ్డున సముద్రానికి అభిముఖంగా ఒక సొంత బంగ్లా కట్టుకోవాలని.. పైగా ఆ బంగ్లాలో తనకు కాబోయే భర్తతో ఏకాంతంగా గడపాలని, ఇల్లీ బేబికి ఎప్పటి నుండో ఉన్న చిరకాల కోరిక అట.

మరి ఇలియానా కోరిక తీరుతుందా ? ఆ కోరిక తీరాలంటే.. దాదాపు మరో పదేళ్లు గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలట. అప్పుడు గానీ, ఆమె అనుకున్న కలకు స్వప్నానికి కావాల్సిన డబ్బు సమకూరదు అట. ఏది ఏమైనా సముద్రం అనేది ఇలియానా జీవితంలో భాగం అయిపొయింది. చిన్న తనం నుండి ఇలియానా సముద్రం ఒడ్డునే ఉంటుంది. గోవా బీచ్ కి దగ్గరలోనే ఇలియానా ఫ్యామిలీ ఉంటుంది. అలాగే ఇలియానా ముంబై వచ్చినా సముద్రానికి దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉంటుంది. ఆమె ముంబైలో ప్రస్తుతం ఉన్న ఇంటినే కొనుక్కోవాలని ఆశ పడుతుంది.

ఇప్పటికే తన సొంత ఇల్లు కోసం ప్రయత్నాలు కూడా చేస్తోంది. మరి ఇలియానా కోరిక ఎప్పటికైనా తీరే ఛాన్స్ ఉందనేది ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్న మాట. ఇక స్టార్ హీరోయిన్ గా తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా.. బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలగాలని ఇక్కడి అవకాశాలను వదులుకుని బాలీవుడ్ కు పోయి.. మొత్తానికి కెరీర్ ను నాశనం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇలియానాకి రెండు మూడు సినిమాల తప్ప పెద్దగా అవకాశాలు కూడా రావట్లేదు. మరి తన కోరికను ఎలా తీర్చుకుంటుందో చూడాలి.

Back to top button