టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

షాకింగ్ : ప్రముఖ నటి మృతి !

Actress Reshma Passed Awayప్రముఖ తమిళ నటి రేష్మా అలియాస్‌ శాంతి(42) శ్వాస సంబంధిత సమస్యతో మృతి చెందారు. పది రోజుల క్రితం గుండెపోటుతో ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స పొందుతున్నారు. అయితే గత నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ఆమె ప్రాణాలను వైద్యులు కాపాడలేయారు.

ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. అయితే, ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. తొలుత పాజిటివ్‌ అని, ఆ తదుపరి నెగెటివ్‌గా భిన్న ఫలితాలు వచ్చాయి. కానీ అంతలో ఆమెకు శ్వాస సమస్య తీవ్రం కావడంతో ఈ లోకాన్ని విడిచారు. బీసెంట్‌ నగర్‌ శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి.

కాగా రేష్మా, కార్తీక్‌ హీరోగా తెరకెక్కిన ‘కిళక్కు ముగం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె నటిగా మంచి గుర్తింపు పొందారు. దాంతో ఆమెకు పలు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అవకాశాలు వరుసగా వచ్చాయి. ఇక సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ కుమారుడు హంసవర్ధన్‌ ను ఆమె వివాహం చేసుకునన్నారు. రేష్మాగా ఉన్న తన పేరును శాంతిగా మార్చుకున్నారు.

ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నటి రేష్మా అలియాస్‌ శాంతి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము

Back to top button