ఆంటీ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ప్రముఖ నటి ‘సురేఖావాణి’ నలభై ఏళ్ల వయసులో ఎక్కువ అందంగా ఉందని, ఆమెకి మగాళ్లు నుంచి విచ్చలవిడిగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయని సురేఖా ఆంటీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తన రెండో పెళ్లి గురించి ఆమె ఓపెన్ అయిపోయింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి కాకుండా మిగిలిపోయిన కొందరు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తెగ ప్రపోజల్ పెడుతున్నారట. ఈ లిస్ట్ లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారట. అమ్మాయిల కోసం వెంటపడే మగాళ్లు చాలామంది ఉన్నారు అంటే.. ప్రస్తుతం అమ్మాయిల రేషియో దృష్ట్యా అది తప్పదులే అనుకోవచ్చు.
కానీ, ఆంటీ కోసం కూడా చాలామంది మగాళ్లు పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతున్నారంటే.. ఏమనకోవాలి ? మొత్తానికి సురేఖా వాణికి ఉన్న డిమాండ్ ను చూస్తుంటే.. త్వరలోనే ఆమె రెండో పెళ్లికి స్క్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది. అయితే, రెండో పెళ్ళికి సురేఖవాణి రెడీ అయితే, ఎలాంటి భర్తను కావాలనుకుంటుంది అని యాంకర్ అడిగితే,
సురేఖా వాణి సిగ్గు పడుతూ “అలాంటివి ఎలా చెబుదాం, అయినా చాల ఉంటాయి, తక్కువేమి ఉండవు అనుకొండి’ అని చెప్పి.. ఒక విషయం గురించి మాత్రం పక్కా క్లారిటీగా చెప్పుకొచ్చింది. తానూ రెండో పెళ్లి చేసుకుంటే గనుక, తనకు కాబోయే వాడు బాగా డబ్బున్న వాడు అయి ఉండాలి అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొడుతూ తానూ ఏమి కోరుకుంటుందో స్పష్టంగా తెలియజేసింది.
పైగా తానూ డబ్బు ఉన్నవాడినే ఎందుకు కోరుకుంటుందో కూడా చెప్పుకొచ్చింది. ‘లైఫ్ లో అన్ని చూసేశాం కదా, డబ్బున్న వాడయితే బెటర్’ అని తన వెర్షన్ ను తెలియజేసింది. అయినా సురేఖా వాణి తాపత్రయం కాకపోతే, బాగా డబ్బు ఉన్నవాడు ఇంకా సింగిల్ గా ఏకాకిగా ఎందుకు ఉంటాడు, ఒకవేళ ఉన్నా సురేఖావాణి ఇలా ఓపెన్ గా డబ్బే కావాలి అని చెప్పిన తరువాత కూడా, ఇక మనస్ఫూర్తిగా ఎలా ప్రేమిస్తాడు. ఏంటో సురేఖా వాణి.