వ్యాపారము

Black Wheat: నల్ల గోధుమలతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఏం చేయాలంటే?

దేశంలోని రైతులకు సంవత్సరంసంవత్సరానికి వ్యవసాయం చేయడానికి ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే ఖర్చులు పెరిగిన స్థాయిలో రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు.

Black Wheat

Black Wheat: దేశంలోని రైతులకు సంవత్సరంసంవత్సరానికి వ్యవసాయం చేయడానికి ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే ఖర్చులు పెరిగిన స్థాయిలో రైతులకు ఆదాయం మాత్రం పెరగడం లేదు.నల్ల గోధుమలను సాగు చేయడం ద్వారా రైతులు సులభంగా లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. మామూలు గోధుమలతో పోలిస్తే ఈ గోధుమలలో ఔషధ గుణాలు 20 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రజల్లో చాలామంది ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. సాధారణ గోధుమలు ఏ విధంగా ఉంటాయో నల్ల గోధుమలు కూడా చూడటానికి అదే విధంగా ఉంటాయి. ఆంథోసైనిన్ వల్ల ఈ గోధుమలు నల్ల రంగులో కనిపిస్తాయి. మోకాలి నొప్పి, రక్తహీనత సమస్యలతో పాటు గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఒత్తిడితో బాధ పడేవాళ్లు నల్ల గోధుమలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది.

నల్ల గోధుమలకు తేమ చాలా ముఖ్యం. రబీ సీజన్ నల్ల గోధుమలను పండించడానికి అనువైన సమయమని చెప్పవచ్చు. నవంబర్ తర్వాత నల్ల గోధుమలను విత్తడం ద్వారా మంచి లాభాలను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. సాధారణ గోధుమల ధరతో పోలిస్తే వీటి ధర ఎక్కువ కావడంతో ఈ గోధుమలను పండించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.

నల్ల గోధుమలను సాగు చేయడానికి పొలంలో జింక్ తో పాటు యూరియా వేయాల్సి ఉంటుంది. గోధుమ విత్తే సమయంలో డీఏపీ, యూరియా, మురేట్ పొటాష్, జింక్ సల్ఫేట్ వేయాలి. మొదటి నీటిపారుదల సమయంలో 60 కిలోల యూరియా వేయాలి. నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మొహాలీ కొత్త రకం నల్ల గోధుమలను అభివృద్ధి చేసింది.

Back to top button