టాలీవుడ్సినిమా

దానిలో మహేష్ తర్వాత విజయ్ దేవరకొండే టాప్ !

Vijay Devarakonda after Mahesh

విజయ్ దేవరకొండ తన స్టార్ డమ్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి.. చివరకు పూరితో ‘లైగర్’ సినిమాని స్టార్ట్ చేశాడు. పక్కా ప్లాన్ తో సినిమా షూటింగ్ షెడ్యూల్స్ సెట్ చేసుకున్నా.. పాపం లైగర్ షూటింగ్ మాత్రం ముందుకు కదలడం లేదు. సినిమా మొదలైన నెలకే కరోనా రావడం.. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి పోస్ట్ ఫోన్ అవుతూనే ఉండటంతో విజయ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నాడు.

దాంతో గత రెండున్నర సంవత్సరాలుగా విజయ్ ‘లైగర్’తోనే కుస్తీ పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరోపక్క సినిమాల వేగం కూడా తగ్గేసరికి సంపాదన కూడా తగ్గింది. అందుకే, విజయ్ ఈ గ్యాప్ లో యాడ్స్ పై పడ్డాడు. నేషనల్ లెవల్లో పెద్ద బ్రాండ్స్ ని తన ఖాతాలో వేసుకోవడానికి కొన్నాళ్ళు పాటు ఏకంగా ముంబైలోనే మకాం మార్చాడు.

ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత, ఆ స్థాయిలో యాడ్స్ చేస్తోన్న తెలుగు హీరో విజయ్ దేవరకొండే. విజయ్ ఖాతాలో ఎక్కువ బ్రాండ్స్ పడటానికి కారణం కరుణ్ జోహార్ అని తెలుస్తోంది. మొదటి నుండి కరుణ్ జోహార్ విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేస్తున్నాడు. కాకపోతే వీరి మధ్య ఒక బిజినెస్ డీల్ ఉంది. వచ్చే రెమ్యునరేషన్ లో 30 % కరుణ్ జోహార్ కు ఇవ్వాలి.

అందుకు, విజయ్ దేవరకొండ కట్టుబడి ఉన్నాడు. అందుకే, హిందీ యాడ్స్ ఏమి వచ్చినా.. ముందుకు విజయ్ దేవరకొండ దగ్గరకు వస్తున్నాయి. అందుకే మొన్నటి వరకు ముంబైలోనే విజయ్ ఉండాల్సి వచ్చింది. నిన్నే హైదరాబాద్ కి వచ్చాడు. అయితే, రాగానే యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. పైగా ఇంట్లోనే ఆ యాడ్ డబ్బింగ్ పని కూడా మొదలు పెట్టాడు.

మొత్తానికి తెలుగులో యాడ్స్ తో ఎక్కువ సంపాదిస్తున్న వారి లిస్ట్ చూస్తే.. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, సమంత కనిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Back to top button