వ్యాపారము

AHIDF Loan Scheme: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణాలు..!

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ కృషి చేస్తోంది. దేశంలోని రైతులలో

 

 AHIDF loan Scheme: Loans To Farmers Associated With Dairy Farming

AHIDF Loan Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు తీపికబురు అందించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ కృషి చేస్తోంది. దేశంలోని రైతులలో ఎక్కువమందికి వ్యవసాయం జీవనాధారం కాగా అందులో పశుపోషణ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కొరకు ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఈ నిధుల ద్వారా రైతులు తక్కువ వడ్డీకే రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇందుకోసం పాడిరైతులు ఉదయమిత్ర పోర్టల్ ను సందర్శించి రిజిష్టర్ చేసుకోవాలి. పోర్టల్ లో అప్లికేషన్ ను ప్రాసెస్ చేసే పేజీని ఓపెన్ చేసి డిపార్టుమెంట్ నుంచి అనుమతి పొందిన తర్వాత రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆ డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతాయని తెలుస్తోంది.

లోన్ తీసుకున్న వాళ్లు వ్యవసాయ సంబంధిత పనులను చేసే సంస్థల ఏర్పాటుకు రుణం పొందడం, పనీర్ లేదా ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడం, పాల కోసం యూనిట్లు ఏర్పాటు చేయడం, పాలపొడి తయారీ కొరకు యూనిట్ ఏర్పాటు, వేర్వేరు రకాల మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం రుణం తీసుకోవచ్చు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతోంది.

ఈ యూనిట్ల ఏర్పాటు వల్ల పశుసంవర్ధక ప్రోత్సాహం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు అంతకంతకూ పెరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో పాలు, మాంసం రంగాలలో ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Back to top button