జనరల్మొబైల్స్

ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. సెకన్లలో మూవీ డౌన్ లోడ్..?

Airtel 5G

ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2021 సంవత్సరంలోనే 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. జియో రాకతో దేశంలో 4జీ నెట్ వర్క్ పోటీ మొదలుకాగా ఎయిర్ టెల్ 5జీ సర్వీసులను మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే నిమిషాల వ్యవధిలోనే హై క్వాలిటీ మూవీస్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. మరో కొత్త ఫీచర్..?

జియో ఈ ఏడాది సెకండాఫ్ లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుండగా ఎయిర్ టెల్ ఒక అడుగు ముందుకేసి ఈ సర్వీసులను తీసుకురావడం గమనార్హం. వాణిజ్య నెట్‌వర్క్‌పై నేడు డెమో ఇచ్చిన ఎయిర్ టెల్ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌పై 5జీ, 4జీని పని చేయించి రెండింటి మధ్య తేడాను చూపించడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ టెక్నాలజీస్ వేగంతో పోలిస్తే ఎయిర్ టెల్ 5జీ వేగం పదింతలు ఎక్కువగా ఉండనుంది.

Also Read: మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయిందా.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు..?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం అనుమతి ఇస్తే ఎయిర్ టెల్ ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్ నుంచి 5జీ, 4జీ సర్వీసులను ఆపరేట్ చేయనుంది. 5జీని దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. ‘ఒప్పో రెనో 5 ప్రొ’, ‘ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రొ’ స్మార్ట్ ఫోన్లను వినియోగించి ఎయిర్ టెల్ 5జీ డెమోను ఇచ్చింది. 5జీ ఫోన్లను వినియోగించే వారు సిమ్ అప్ గ్రేడ్ చేసుకోకుండా 5జీ సర్వీసులను పొందవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: మొబైల్స్

ఎయిర్‌టెల్ 5జీ భారత్ లో అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లకు 5జీ వేగంతో ఇంటర్నెట్ ను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఎయిర్ టెల్ 5జీ దిశగా అడుగులు వేయడంతో ఇతర టెలీకాం కంపెనీలు కూడా త్వరలో 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

Back to top button