బాలీవుడ్సినిమా

ప్రభాస్ సినిమాలో ప్రపంచ సుందరి !


కొన్ని రూమర్లు భలే విచిత్రంగా ఉంటాయి, అస్సలు నమ్మబుద్ధి కాదు.. కానీ, నమ్మకుండా ఉండలేం. ప్రస్తుతం అలాంటి రూమర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. నేషనల్ స్టార్ గా ప్రభాస్ తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ పోతున్న క్రమంలో బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ లాంటి మహుమహులు నటిస్తారని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. తాజాగా మరో రూమర్ ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

Also Read: కూచిపూడి కళాకారిణి శోభానాయుడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది: చిరంజీవి

ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే.. ‘ఆదిపురుష్’లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ నటించబోతుందని తెలుస్తోంది. అయితే ఐశ్వర్యరాయ్‌ గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది. కానీ మధ్యలో కొన్ని సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర అయితే ఆ సినిమాలు చేస్తోంది. మరి భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్న ఆదిపురుష్ లో ఓ అత్యంత కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రకు ఐశ్వర్యరాయ్‌ అయితేనే న్యాయం జరుగుతుందని.. అందుకే ఆమెను ఆ పాత్ర చేయడానికి ఒప్పించారని తెలుస్తోంది. ప్రభాస్ బర్త్ డే 23వ తేదిన ఈ వార్త అఫీషియల్ న్యూస్ గా ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

Also Read: ‘రామాయణం’లో.. రాముడిగా మహేష్ రావణుడిగా ఎన్టీఆర్ ?

ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు. హైట్ ను మ్యానేజ్ చేసినా.. ఆ హైట్ కి తగ్గ బాడీని చాలా సహజంగా చూపించాలని, అందుకే ప్రభాస్ తన బాడీని పెంచే సన్నాహాల్లో ఉన్నాడు. ఏమైనా ఈ సినిమా దర్శకుడు సంజ‌య్ రౌత్.. బాలీవుడ్ జీనియస్.. హాలీవుడ్ స్థాయి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అత్యంత ప్రతిభావంతమైన దర్శకుడు. తీసింది తక్కువ సినిమాలే అయినా.. సంజ‌య్ రౌత్ కి విపరీతమైన పాపులారిటి ఉంది. ఇప్పటికే మరాఠిలో ‘లోకమాన్య : ఏక్ యుగ పురుష్’ అనే సినిమా తీసి ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకున్నాడు. ఇక అజయ్ దేవగణ్ తో తీసిన ‘తానాజీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Back to top button