టాలీవుడ్సినిమా

ఆ ఫ్లాప్‌ తెలుగు మూవీని హిందీలో 10 కోట్ల మంది చూసేశారు..


కొన్ని సినిమాలు అంతే. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే బాక్సాఫీస్‌ దగ్గర తుస్సుమంటాయి. ప్రేక్షకులు కూడా ఒక పట్టాన అర్థం కారు. బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టే మూవీస్‌ను ఆ తర్వాత ఆదరిస్తారు. సిల్వర్ స్క్రీన్‌ ‌పై చూసేందుకు ఇష్టపడని వాళ్లు.. నట్టింట్లో, నెట్టింట్లోని బుల్లి తెరలపై తెగ చూసేస్తారు. ఆ లిస్ట్‌లో చాలా మూవీసే ఉన్నాయి. అందులో యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన ‘మిస్టర్ మజ్నూ’ కూడా చేరింది. అయితే, ఈ మూవీకి ఓ స్పెషాలిటీ ఉంది. తెలుగు ప్రేక్షకులు మొహం చాటేసిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. హిందీలో డబ్‌ అయిన ఈ మూవీకి యూట్యూబ్‌లో ఏకంగా 100 ప్లస్‌ మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయ. అంటే 10 కోట్ల మంది పైచిలుకు  ఈ సినిమాను చూశారు. ఇన్ని వ్యూస్‌ నెల రోజుల వ్యవధిలోనే రావడం మరో విశేషం. జులై 4వ తేదీన ఈ మూవీ హిందీ డబ్‌ వెర్షన్‌ను యూట్యూబ్‌లో ఫస్ట్‌ అప్‌లోడ్‌ చేయగా… ఇప్పటికి 10.11 కోట్ల వ్యూస్‌ వచ్చాయి.

Also Read: వచ్చింది ప్రభాస్‌ మరి..

నాగార్జున సూపర్ హిట్‌ చిత్రం మజ్ను టైటిల్‌ను ఉపయోగించుకున్న ఈ మూవీపై అఖిల్‌ చాలా ఆశలు పెట్టుకున్నా అవి ఫలించలేకపోయాయి. వెంకీ అట్లూరి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అఖిల్‌.. అమ్మాయిల మనసు దోచే విక్కీ పాత్రను పోషించాడు. నిధి అగర్వాల్‌ నిక్కీ అనే పాత్రలో నటించగా.. ఫారిన్‌ నటి ఇజాబెల్లే లీట్‌ మాధవి అనే చిత్ర పాత్ర చేసింది. ఫస్టాఫ్‌ ఎంటర్టైనింగ్‌గా సాగినా… యూఎస్‌కు షిఫ్ట్‌ అయ్యే సెకండాఫ్‌లో ఈ మూవీ గాడి తప్పింది. జబర్దస్త్‌ హైపర్ ఆది కామెడీ ట్రాక్ కూడాపేలిపోయింది. ఈ మూవీలో నాగబాబు, సుబ్బరాజు, రమేశ్‌ రాజు, పవిత్రా లోకేశ్‌ ఇతర పాత్రలు పోషించారు. థమన్‌ మ్యూజిక్‌ అందించాడు. నిర్మాత బీవీఎన్‌ఎస్‌ ప్రసాద్‌కు ఈ చిత్రం లాస్‌ తెచ్చిపెట్టింది.

Also Read: ‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

థియేటర్లలో ఎక్కువ రోజులు సందడి చేయలేకపోయిన మిస్టర్ మజ్నూ.. హిందీ వెర్షన్‌ అనూహ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నిధి అగర్వాల్‌ కోసం హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా మాతృభాషలో నిరాశ పరిచిన ఓ ఫెయిల్యూర్మూవీతో అఖిల్‌ నార్త్‌ ప్రేక్షకులకు చేరువయ్యాడనొచ్చు. అంతకుముందు చేసిన హలో, అఖిల్‌ కూడా నిరాశ పరచగా కెరీర్లో ఫస్ట్‌ హిట్‌ కోసం అక్కినేని వారసుడు ఎదురు చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’తో ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్‌ సరసన హాట్‌ యాక్ట్రెస్‌ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌ గా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Tags
Back to top button
Close
Close