టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఫ‌స్ట్ లుక్ః ఏజెంట్ అక్కినేని.. అద్ద‌రగొడుతున్న క‌టౌట్‌!

Akhil
త‌రం మారింది.. ఆలోచ‌న‌లు మారాయి.. ప్రేక్ష‌కుల అభిరుచులూ మారాయి.. ఇక‌, మారాల్సింది హీరోలు, మేక‌ర్సే! ఈ విష‌యాన్ని ఎన్నో ఘ‌ట‌న‌లు రుజువు చేశాయి. ల‌వ్ బ్యాక్ డ్రాప్ సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో సేఫ్‌ లాంఛింగ్ అనేది ఒక‌ప్ప‌టి మాట‌. ఈ జోన‌ర్ లోనే ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి స్ట్ర‌గుల్ అవుతున్న వారిలో అఖిల్ కూడా ఉన్నాడు. ఈ త‌రానికి కావాల్సింది రెగ్యుల‌ర్ కాదు.. వాళ్లు కొత్త‌గా ఏదో ఆశిస్తున్నారు. ఆల‌స్యంగానైనా ఈ విష‌యాన్ని గుర్తించిన అక్కినేని చిన్నోడు.. ఇదిగో ఇచ్చేస్తున్నా అంటూ వ‌చ్చేస్తున్నాడు!

ఇప్ప‌టి వ‌ర‌కూ అఖిల్ చేసి మూడు సినిమాలూ దాదాపుగా ల‌వ్ స్టోరీసే. రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కూడా ప్రేమ‌క‌థా చిత్ర‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌లోని ప్రేమికుణ్ని చూపించింది చాల‌ని అనుకున్నాడో ఏమో.. క్వైట్ అపోజిట్ లో డిఫ‌రెంట్ జోన‌ర్ ను ఎంచుకున్నాడు అఖిల్‌.

ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి అఖిల్ ను ‘ఏజెంట్’గా చూపించబోతున్నాడు. ఈ విష‌యాన్ని ఫ‌స్ట్ లుక్ వ‌దిలి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశాడు. ఈ లుక్ చూస్తుంటే.. కంటెంట్ ఉన్న క‌టౌట్ ను రిలీజ్ చేసిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రం కోసం అఖిల్ ఏ స్థాయిలో ఛేంజోవ‌ర్ అయ్యాడో అత‌ని మేకోవ‌ర్ చూస్తేనే తెలిసిపోతోంది.

ఏజెంట్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ లా క‌నిపిస్తున్నాడు. గిరజాల జుట్టుతో.. రగ్గ్ డ్ బియార్డ్ తో మీసాల‌తో అఖిల్ క‌టౌట్ అద్ద‌ర‌గొడుతోంది. అచ్చం నిజ‌మైన ఏజెంట్ లానే క‌నిపిస్తున్నాడు. న‌రాలు తేలిన ఒళ్లు.. వేళ్ల మ‌ధ్య‌న కాలిపోతున్న సిగ‌రెట్టు.. మొత్తం క‌లిపి ర‌ఫ్ గా క‌నిపిస్తున్న ఫ‌స్ట్ లుక్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది.

అనిల్ సుంక‌ర – ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ – సురేంద‌ర్‌-2 సిన‌మా బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వ‌క్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారు. వీరి కాంబోలో గ‌తంలో ప‌లు చిత్రాలు విజ‌య‌వంతం కావ‌డంతో.. మంచిఅంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక‌, త‌న హీరోను సురేంద‌ర్ రెడ్డి ఏ స్థాయిలో చూపిస్తాడో ఆయ‌న ట్రాక్ రికార్డే చెబుతుంది. మొత్తానికి డిఫ‌రెంట్ జోన‌ర్లోకి ప్ర‌వేశించిన అఖిల్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

ఈనెల 11 నుంచి రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది డిసెంబ‌ర్ 24న క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌తో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య కనిపించ‌నుంది. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నారు.

Back to top button