టాలీవుడ్సినిమా

‘బ్యాచ్‌ల‌ర్’తో ‘పూజా హెగ్డే’.. కేక !

Akhil Akkineni and Pooja Hegde
‘అక్కినేని అఖిల్’కి హీరో కాకముందే విపరీతమైన హైప్ వచ్చింది. కానీ, హీరో అయ్యాక స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడుతూ.. ఈ క్రమంలో ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే సినిమా చేస్తున్నాడు. అఖిల్ సరసన బుట్ట బొమ్మ ‘పూజా హెగ్డే’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్ లో అఖిల్, పూజ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మొత్తానికి పోస్టర్ కలర్‌ఫుల్‌ గా ఉంది. ఏది ఏమైనా ‘బ్యాచ్‌ల‌ర్’ నుండి అభిమానులకు పొంగల్ సందర్బంగా ఓ స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పూజ హెగ్డే !

ఇక ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు కూడా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు, మనసా మనసా పాటకు మంచి ఆదరణ లభించింది. బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి గతంలో కూడా ఓ పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ లో అఖిల్ వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే కాలితో టీజ్ చేసే ఈ స్టిల్ యూత్ కి అండ్ అక్కినేని అభిమానులకు మంచి కిక్ ను ఇచ్చింది. తాజాగా వదిలిన పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి బాగా ఆకట్టుకుంటుంది.

Also Read: రివ్యూ : మాస్టర్ – బోరింగ్ యాక్షన్ డ్రామా !

కాగా ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు కంప్లీటయిందని.. సినిమాలో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. ముఖ్యంగా అఖిల్ – పూజాకి మధ్య లిప్ టు లిప్ కిస్ ఉంటుందని.. ఆ కిస్ సీన్ లో మొత్తానికి పూజా హెగ్డే తన అందాలను ఆరబోయటంలో ఎలాంటి హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అలాగే వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా ఉంటుందట. అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ ప్లాప్ కావడంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Most Eligible Bachelor

Back to top button