బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఓటీటీ రికార్డులన్నీ బద్దలుకొట్టిన ‘లక్ష్మీ’..!

Laxmi

సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్టయిన ‘కాంచన’ మూవీతో బాలీవుడ్లో ‘లక్ష్మీ’గా రీమేక్ అయింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్.. కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు నటించారు. సాధారణంగానే అక్షయ్ కుమార్ సినిమాలకు హిందీ యమక్రేజ్ ఉంటుంది. ఆయన ప్లాపు సినిమాలే ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేస్తుంటాయి.

Also Read: గాంధీ, నెహ్రూలను కూడ వదలని కంగనా

తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ’ ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్లో రిలీజైంది. ఇప్పటివరకు ఓటీటీలో రిలీజైన సినిమాలన్నింటి కంటే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రం ‘లక్ష్మీ’ మూవీ రికార్డు సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు సుశాంత్ సింగ్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’ పేరిట ఉంది. తాజాగా ఈ రికార్డును ‘లక్ష్మీ’ మూవీ దక్కించుకుంది.

Also Read: మూడేళ్ళ వయసులోనే లైంగిక దాడికి గురయ్యానంటున్న హీరోయిన్

‘దిల్ బేచారా’ మూవీ 24గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డు సాధించగా ‘లక్ష్మీ’ కేవలం సగం రోజులోనే ఆ రికార్డును చేరుకుంది. ఈ మూవీ సోమవారం సాయంత్రం 7.05 గంటలకు విడుదల కాగా.. మంగళవారం ఉదయానికే రికార్డు వ్యూస్ మార్కును దాటేసిందని హాట్ స్టార్ వెల్లడించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

‘లక్ష్మీ’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ అత్యధిక వ్యూస్ సాధించడం విశేషం. ఇప్పటివరకు వ్యూస్ బట్టి చూస్తే ఈ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లు దాటచ్చని అంచనా వేస్తున్నారు. దీపావళికి ముందుగా ‘లక్ష్మీ’ సినిమా మతాబులా పేలడంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ తోపాటు ఓటీటీ నిర్వాహాకులు, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Back to top button