ఓవర్సీస్ షో టైమింగ్స్సినిమాసినిమా రివ్యూస్

అల.. వైకుంఠపురంలో.. మూవీ రివ్యూ

 

నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, తదితరులు
దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
సంగీతం: తమన్‌
నిర్మాత: అల్లు అరవింద్‌, రాధాకృష్ణ(చినబాబు)
రేటింగ్:3.5/5

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టారా.. అలాగే ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

వాల్మీకి (మురళి శర్మ) తన స్వార్థంతో చేసిన ఓ పొరపాటు వల్ల బంటు(అల్లు అర్జున్) వాల్మీకి కొడుకుగా ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా బతకాల్సి వస్తోంది. చిన్నప్పటి నుంచీ అలాగే పెరిగిన బంటుకు తన పుట్టుక గురించి తన తల్లిదండ్రుల గురించి ఒక నిజం తెలుస్తుంది. ఈ మధ్యలో బంటు అమూల్య (పూజా హెగ్డే) దగ్గర జాబ్ లో జాయిన్ అవుతాడు. అలాగే ఆమెతో ప్రేమలో కూడా పడతాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం బంటు అసలు కుటుంబం కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటుంది. దాంతో బంటు తన కుటుంబాన్ని ఆ సమస్యల నుండి ఎలా బయట పడేశాడు? ఇంతకీ బంటు తల్లిదండ్రులు ఎవరు? చివరికి తన ఒరిజనల్ తల్లిదండ్రులకు బంటు ఏమి చేశాడు?లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

 

పెర్ఫార్మన్స్:

ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్‌.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఎమోషన్‌ సీన్లలో తేలిపోతాడనే చిన్న అపవాదు ఉండేది. అయితే ఈ సినిమాతో ఎమోషన్స్‌ అనే ముచ్చటను కూడా తీర్చేశాడు. బన్ని అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎనర్జీ, డ్యాన్స్‌లు, కామెడీ పంచింగ్‌ టైమ్‌. అయితే ఈ సినిమాలో వీటితో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.. మైమరిపించాడు. దాదాపు సినిమా మొత్తం అల్లు అర్జున్‌ చుట్టే తిరుగుతుంది. దీంతో ఆ బాధ్యతను బన్ని మంచినీళ్లు తాగినంత సులువుగా మోశాడు. ఈ సినిమాతో నటుడిగా, హీరోగా వంద శాతం ప్రూవ్‌ చేసుకున్నాడు. అల్లు అర్జున్‌ తర్వాత చెప్పుకోవాల్సింది మురళీ శర్మ గురించి. కన్నింగ్‌, శాడిజం ఇలా పలు వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొడుకుపై శాడిజం చూపించే తండ్రిగా మురళీ శర్మ జీవించాడు.

 

పూజా హేగ్డే చాలా అందంగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో బన్ని చెప్పినట్టు ‘మేడమ్‌ అంతే’ అనే విధంగా పూజా ఉంటుంది. అందంతో పాటు అభినయంతో హావభావాలను పలికించింది. ఇక సుశాంత్‌ సెటిల్డ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో విలన్‌గా కనిపించిన సముద్రఖనికి ఎక్కువ సీన్లు పడలేదు. అయితే డిఫరెంట్‌ మేనరిజంతో పర్వాలేదనిపించాడు. సచిన్‌, జయరామ్‌లు కొన్ని ఎమోషన్స్‌ సీన్లలో కంటతడి పెట్టించారు. చాలా కాలంతర్వాత తెలుగు సినిమాలో కనిపించిన టబుకు పెద్ద క్యారెక్టర్‌ లభించకపో​యినప్పటకీ ఉన్నంతలో ఆకట్టుకుంది. నిన్నే పెళ్లాడతా సినిమాలో టబును చూసినట్టే ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ఇక రాహుల్‌ రామకృష్ణ, సునీల్‌, రాజేంద్రప్రసాద్‌, హర్షవర్దన్‌లు చేసే కామెడీ ఓ మోస్తారుగా ఉంటుంది. నవదీప్‌ ఉన్నంతలో ఉన్నంత ఫర్వాలేదనిపించాడు.

 

ప్లస్ పాయింట్స్ :

అల్లు అర్జున్‌ నటన
తమన్ మ్యూజిక్‌
యాక్షన్‌ సీన్స్‌
స్క్రీన్ ప్లే

 

మైనస్ పాయింట్స్ :

సినిమా నిడివి
కథలో కొత్తదనం లోపించడం

 

తీర్పు :

త్రివిక్రమ్ దర్శకత్వంలో మంచి పాయింట్ తో గుడ్ ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లేతో బలమైన పాత్రలు మరియు భారీ తారాగణంతో అలాగే డీసెంట్ కామెడీతో బాగా అకట్టుకుంది. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, లవ్ సీన్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి. కానీ బన్నీ తన నటనతో తన డాన్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. పండగ వచ్చిందంటే ఈ గజిబిజీ సిటీ లైఫ్‌ను వదిలేసి మన అమ్మమ్మ, తాతయ్య వాళ్లింటికి లేదా మన సొంత ఊరికి వెళితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ సినిమా చూస్తే కూడా అలాంటి అనుభూతి కలుగడం ఖాయం.

Back to top button