వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: ఆర్ఆర్ఆర్ సీత అజ్ఞాతవాసం ఇలా

Alia Bhatt posts photos from Covid isolation

ఆర్ఆర్ఆర్ సీతా అజ్ఞాతవాసం చేస్తోంది. అందరినీ వదిలేసి ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. దానికి కారణం ఉంది. ఈ మధ్య ఆలియా భట్ నటిస్తున్న మూవీలోని హీరోకు, దర్శకుడికి కరోనా సోకడంతో వారితోపాటు నటించిన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు సైతం కరోనా సోకడంతో ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

ప్రస్తుతం కోవిడ్ -19తో ఇంట్లో నిర్బంధంలో ఉన్న బాలీవుడ్ స్టార్ అలియా భట్ శనివారం అభిమానులకు విషాదంతో ఉన్న రెండు ఫొటోలను షేర్ చేసింది. మంచం మీద దీనంగా పడుకున్న రెండు చిత్రాలు షేర్ చేసింది. “డ్రీమర్స్ ఎప్పుడూ మేల్కొలపరు” అని అలియా తన ఫొటోలతోపాటు క్లౌడ్ ఎమోజీతో షేర్ చేసింది.

అలియాకు ఏప్రిల్ 2న కరోనావైరస్ సోకింది. తన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పంచుకుంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్న నటి సంజయ్ లీలా భన్సాలీ నటించిన “గంగూబాయి కాతివాడి” షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ షూటింగ్ లోనే ఆమెకు కరోనా సోకింది. యాదృచ్ఛికంగా, ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ కూడా ఇదే సినిమా షూటింగ్ సమయంలో వైరస్ బారిన పడ్డాడు. వీళ్లిద్దరూ ఇప్పుడు ఒంటరిగా భయంకరమైన ఐసోలేషన్ ను అనుభవిస్తున్నారు. ఆ బాధలోనే ఆలియా ఇలా వైరాగ్యంతో రాసుకొని వచ్చింది.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో “బ్రహ్మస్త్రా” లో అలియా – రణబీర్ కలిసి నటిస్తున్నారు.. నాగార్జున మరియు మౌని రాయ్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఇవే కాకుండా ఆలియా భట్.. కరణ్ జోహార్ మల్టీస్టారర్ “తఖ్త్” తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ జూనియర్ మరియు అజయ్ దేవగన్ తో కలిసి “బాహుబలి” దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న “ఆర్ఆర్ఆర్” కూడా నటిస్తోంది.

Back to top button