సినిమాసినిమా వార్తలు

బన్నీ ఇక స్టైలిష్ స్టార్ కాదు.. ఏ స్టార్ అంటే?

Allu Arjun as an iconic star with the movie Pushpa

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ టీజర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊర మాస్ లెవల్ లో అల్లు అర్జున్ చూసిన ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతోంది. ఈ ట్రైలర్ లో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ వీరలెవల్లో కనిపించాడు.

అయితే ట్రైలర్ చివర్లో దర్శకుడు సుకుమార్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్నాళ్లుగా స్టైలిష్ స్టార్ గా ఉంటున్న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో సుకుమార్ మార్చేశాడు. కొత్త స్టార్ పేరు ను పెట్టేశారు.

బన్నీ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్య సినిమాలో ఆ యన స్టైలిష్ చూసి స్టైలిష్ స్టార్ అని బిరుదు సార్థకమైంది. అయితే పుష్ప సినిమాతో ఆ స్టార్ ను మార్చేశాడు సుకుమార్.

తాజాగా పుష్పలో ఊరమాస్ గెటప్ తో అల్లు అర్జున్ ను ‘ఐకాన్ స్టార్’గా మార్చేశాడు సుకుమార్. అభిమానులు ముద్దుగా పిలుచుకునే స్టైలిష్ కు కేరాఫ్ అడ్రస్ అయిన బన్నీ ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాడు. అందుకే ఇండియా లెవల్ లో మంచి బిరుదు ఉండాలని ‘ఐకాన్ స్టార్’ గా పెట్టినట్టు తెలుస్తోంది. మరీ ఈ బిరుదు సార్థకం అవుతుందా.? బన్నీ క్రేజ్ అన్ని భాషలకు పాకి ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడా? అన్నది వేచిచూడాలి.

Back to top button