బ్రేకింగ్ న్యూస్సినిమాసినిమా బ్రేకింగ్ న్యూస్సినిమా వార్తలు

అల్లు అర్జున్ పుష్ప సినిమా వాయిదా

Allu Arjun Pushpa movie postponed

కథల కొరత.. క్వాలిటీల కొరత.. కరోనా కల్లోలం ఏదీ టైంకు జరగడం లేదు. హీరోలు సంతృప్తి అవ్వడం లేదు. అందుకే టైం తీసుకొని నింపాదిగా చేయాలని హీరోలంతా డిసైడ్ అవుతున్నారు. ఒకరినొకరు కూడబలుక్కొని అగ్రదర్శకులను సామరస్యంగా లాక్ చేసుకొని కొత్త సినిమాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఆగమాగం చేసి క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉండాలనే తాజాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రస్తుతం తీర్చిదిద్దుతున్న మూవీ ‘పుష్ప’ను వాయిదా వేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యిందట.. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ కు ఇప్పటికే డేట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు దాన్ని డిసెంబర్ లేదా జనవరికి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలల పాటు పుష్ప సినిమాను వాయిదా వేసేశారట..

ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా రద్దు అయినట్టు టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ‘ఆచార్య’ పూర్తి కావడంతో దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారట..

అయితే కొరటాల మాత్రం ఇప్పటికే చిరంజీవి సినిమా పూర్తయ్యాక అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించారు. ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆరు నెలల వాయిదాతో ఈ ఆరు నెలల్లో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కొరటాల శివ రెడీ అయ్యారట.. ఈ మేరకు బన్నీతో కొరటాల, ఎన్టీఆర్ మాట్లాడి ఒప్పించినట్టు తెలిసింది. మొత్తానికి టాప్ దర్శకుల కోసం మన హీరోలు ఇలా సర్దుబాటు చేసుకుంటున్న వైనం చర్చనీయాంవమవుతోంది.

Back to top button