ఆరోగ్యం/జీవనం

బిళ్ళ గన్నేరుతో క్యాన్సర్, షుగర్ లకు చెక్.. ఆ ఔషధ ప్రయోజనాలతో..?

మానవులకు జీవించడానికి అవసరమైన వాటిని ప్రకృతి ప్రసాదిస్తుందనే సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రసాదిత ఔషధాల సహాయంతో మనుషులకు వచ్చే అనేక శారీరక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చు. బిళ్ళ గన్నేరు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటంతో పాటు ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లు అనేక వ్యాధులకు చెక్ పెట్టడంలో ఎంతగానో సహాయపడతాయి. బిళ్ళ గన్నేరు మొక్కతో క్యాన్సర్, మధుమేహంకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

గార్డెన్ లో అలంకరణ కొరకు బిళ్ల గన్నేరు మొక్కను ఎక్కువగా వినియోగిస్తారు. బిళ్ళ గన్నేరు మొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి ఆ వేర్లను ఎండబెట్టి గాలి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ వేర్లను పొడిగా చేసుకుని రోజూ ఉదయం పరగడుపున తింటే ఎలాంటి షుగర్ వ్యాధి అయినా తగ్గే అవకాశం ఉంటుంది. బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల రసం సహాయంతో క్యాన్సర్ వ్యాధికి సులభంగా చెక్ పెట్టవచ్చు.

బిళ్ల గన్నేరు ఆకుల పొడిని టీ మాదిరి డికాషన్ లా చేసుకుని రోజూ తాగితే క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గించడంలో సహాయపడతాయి. బిళ్ల గన్నేరు ఆకులను కడిగి ఆ రసాన్ని రోజూ టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. రుతు సమస్యల నివారణకు చెక్ పెట్టడంలో బిళ్ల గన్నేరు ఎంతగానో సహాయపడుతుంది.

గాయాలు, పుండ్లకు బిళ్ల గన్నేరు ఆకులు యాంటీ సెప్టిక్ క్రీమ్ లా పని చేస్తాయి. ముక్కు నుంచి రక్త స్రావం వచ్చినా బిళ్ల గన్నేరు రసం వేస్తే ఆ సమస్య తగ్గుతుంది. మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బిళ్ల గన్నేరు సహాయపడుతుంది. పురుగులు, కీటకాలు కుట్టిన చోట వచ్చే దద్దుర్లకు బిళ్ల గన్నేరు రసం చెక్ పెడుతుందని తెలుస్తోంది.

Back to top button