ప్రత్యేకంవిద్య / ఉద్యోగాలువీడియోలువ్యాపారము

విద్యార్థులకు అమెజాన్ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆన్ లైన్ క్లాసులు..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. అమెజాన్ అకాడ‌మీ పేరుతో ఫ్రీగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు అందించడానికి సిద్ధమైంది. జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అమెజాన్ అందిస్తున్న ఆన్ లైన్ క్లాసుల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కరోనా విజృంభణ తరువాత దేశంలో ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే.

అమెజాన్ కూడా విద్యార్థులు సైతం ఆన్ లైన్ క్లాసులపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల దిశగా అడుగులు వేసింది. అమెజాన్ ఆన్‌లైన్ అకాడ‌మీ ద్వారా యాప్ లేదా వెబ్ సైట్ నుంచి విద్యార్థులు కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. యాప్, వెబ్ సైట్ లో లైవ్ లెక్చ‌ర్లు, అసెస్‌మెంట్లు, లెర్నింగ్ మెటీరియల్ ను అమెజాన్ అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. అమెజాన్ అందుబాటులోకి తెచ్చిన ఈ సర్వీసులకు ప్రస్తుతం ఎటువంటి ఛార్జీలు లేవు.

ఉచితంగానే విద్యార్థులు అమెజాన్ అకాడమీ ద్వారా క్లాసులను వినవచ్చు. అమెజాన్ ఇండియా రాబోయే కొన్ని నెలల వరకు ఉచితంగా క్లాసులను వినే అవకాశం విద్యార్థులకు కల్పిస్తోంది. అయితే భవిష్యత్తులో మాత్రం విద్యార్థులు ఉచితంగా ఆన్ లైన్ క్లాసులు వినలేరు. దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు జేఈఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు

అమెజాన్ భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని కొత్త కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అమెజాన్ విద్యా రంగం దిశగా అడుగులు వేయడం ద్వారా విద్యార్థులకు మరింతగా చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Back to top button