అంతర్జాతీయంరాజకీయాలుసంపాదకీయం

Escaping America: అమెరికా పలాయనం.. ఇదే తొలిసారి కాదు..

చరిత్రలో వియత్నం, క్యూబా, సోమాలియాల్లో కూడా ఇలానే అప్ఘనిస్తాన్ లాగానే అమెరికా సైన్యం వైదొలగింది.

అగ్రరాజ్యం అమెరికా చేసిన పొరపాటే ఇప్పుడు అప్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల రాకకు కారణమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని జంట భవనాలను కూల్చి అమెరికన్లను చంపిన ఆల్ ఖైదాను, దానికి అండగా నిలబడ్డ తాలిబన్లను అణచివేసి 20 ఏళ్ల పాటు అప్ఘనిస్తాన్ కు ప్రజాస్వామ్య ఫలాలను అమెరికా పంచింది. తన ప్రతీకారం పూర్తయ్యిందంటూ ఏమాత్రం ప్రణాళిక లేకుండా అప్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు వైదొలగడం అప్ఘన్ దేశానికి శాపమైంది. అప్ఘనిస్తాన్ ను చేజేతులా తాలిబన్లకు అమెరికా అప్పగించినట్టైంది.

-అప్ఘన్ సేనలదీ తప్పే..
ఒసామా బిన్ లాడెన్ ను చంపడం.. ఉగ్రవాదాన్ని రూపుమాపడమే ధ్యేయంగా 20 ఏళ్లుగా అప్ఘనిస్తాన్ లో తిష్టవేసిన అమెరికా అనుకున్న లక్ష్యాలను సాధించింది. 20 ఏళ్లలో 3 లక్షల మందికి పైగా అప్ఘాన్ సైనికులు, పోలీసులకు అమెరికా అత్యాధునిక శిక్షణ అందించింది. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చింది. అయినా వారు తాలిబన్లకు భయపడి దేశం కోసం ఏమాత్రం పోరాడకుండా తాలిబన్లకు లొంగిపోవడమే అప్ఘనిస్తాన్ కు శాపమైంది.ఇక అమెరికా సైన్యం అర్థరాత్రి వేళ అన్ని సర్దుకొని వెళ్లిపోవడం కూడా అప్ఘన్ దళాల ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి కారణమైంది. తాలిబన్లతో ట్రంప్ హయాంలో ఒప్పందం చేసుకొని అమెరికా వెళ్లిపోవడంతో ఇక అప్ఘన్ సేనలు నీరుగారిపోయాయి. అధ్యక్షుడు, నిఘా విభాగాధిపతి సైతం దేశం విడిచి పారిపోవడంతో అప్ఘన్ సైన్యం మొత్తం చేతులేత్తేసింది.

-అమెరికా ఇలా వైదొలగడం ఇదే కొత్త కాదు..
అమెరికా తన ప్రతీకారాన్ని తీర్చుకొని ఇక సాధ్యం కాకపోతే ఆ దేశాలను ఉన్న ఫలంగా వదిలేయడం ఇదే మొదటి సారు కాదు.. దాని బాధితుడిగా మారిన మొదటి దేశం అప్ఘనిస్తాన్ మాత్రమే కాదు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నాలుగు ప్రధాన దేశాలను ఇలాగే మధ్యలోనే వదిలేసి చాపచుట్టేసిన సంఘటనలు ఉన్నాయి.

అప్ఘనిస్తాన్ కంటే ముందే అమెరికా ఈ దేశాలపై దాడులు చేసింది. వియత్నాం, క్యూబా, సోమాలియా.. వీటి నుంచి అమెరికా ఇలానే సడెన్ గా వైదొలిగింది.

-వియత్నంలో అమెరికా ఓడినట్టే..
ఆగ్నేయాసియా దేశమైన వియత్నం విషయంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వియత్నంపై యుద్ధం ప్రకటించిన అమెరికా వరుసగా 19 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఆ దేశం విడిచిపెట్టింది. 1975 ఏప్రిల్ 29న అమెరికా దేశం వియత్నంలో యుద్ధం ముగించి వైదొలగింది. 19 ఏళ్లు భయంకరమైన బాంబు దాడులు చేసి.. ఆధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ ఉత్తర వియత్నం కమ్యూనిస్ట్ దళాలతో జరిగిన దాదాపు 58000 మంది అమెరికన్ సైనికులు మరణించారు. దీంతో యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రజలు రోడ్డెక్కారు. దీంతో 1973లో అమెరికా ఆర్మీ పారిస్ శాంతి ఒప్పందం పేరుతో వియత్నం వదలాలని నిర్ణయించింది. రెండేళ్లలోనే కమ్యూనిస్టు సైన్యం దక్షిణ వియాత్నం ఆక్రమించి దేశాన్ని కైవసం చేసుకుంది. అమెరికా హెలిక్యాప్టర్లు పంపి మరీ తమ యూఎస్ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని దొంగచాటుగా తరలించుకుపోయిన దుస్థితి నెలకొంది.

-క్యూబా చేతిలోనూ ఘోరంగా ఓడింది..
తమకు కొరకరాని కొయ్యగా మారిన క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోను పడగొట్టడానికి అమెరికా ఆ దేశంపై దాడి చేసింది. ఐదు విమానాలతో దాడులు చేయగా మూడు విమానాలను క్యూబా కూల్చివేసింది. దీంతో అమెరికా వెనక్కి వెళ్లి అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఫీడెన్ క్యాస్ట్రో దించడానికి ఐదుసార్లు ప్రయత్నించిన అమెరికా చివరకు 1962 డిసెంబర్ 29న క్యూబా నుంచి అమెరికా వైదొలిగి దాదాపు ఓడిపోయినట్టైంది. అయితే సోవియట్ యూనియన్ క్యూబాకు అండగా నిలిచి అక్కడ క్షిపణలు పెట్టడం.. అమెరికా నావికా దళంతో అణుదాడి చేస్తామని క్యూబాను ముట్టడించింది. రెండు దేశాలు అణుయుద్దం అంచుకు వచ్చాయి. కానీ సోవియట్ యూనియన్ వెనక్కి తగ్గడంతో ఈ సంక్షోభం తప్పింది.

-సోమాలియాలోనూ అమెరికా అదేనీతి
1993 అక్టోబర్ 3న రాత్రి అమెరికా, మహ్మద్ ఫరా నేతృత్వంలోని సోమాలియన్ తిరుగుబాటు సైన్యం తో సోమాలియా దేశంలోకి ఎంట్రీఇచ్చారు. సోమాలియా అధ్యక్షుడు మహ్మద్ సియాద్ బారెను దించేశారు. అంతర్యుద్ధం మొదలైంది. అయితే అమెరికాన్ సైనికులు 19మందిని చంపి వారిని తిరుగుబాటుదారులు నడి వీధిలో ఊరేగించి అమెరికన్ టీవీల్లో ప్రసారం చేశారు. ఈ ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగి అక్కడి నుంచి పాకిస్తాన్, అమెరికన్ సైన్యాన్ని తరలించింది.

ఇలా అమెరికా చాలా దేశాల్లో మొదట చురుకుగానే యుద్ధాన్ని మొదలుపెడుతుంది. ఆ తర్వాత జరుగుతున్న నష్టాలకు వెంటనే పలాయనం చిత్తగిస్తుంది. వారి మానాన వారిని వదిలేస్తుంది. అప్ఘనిస్తాన్ విషయంలోనూ అమెరికా వ్యవహరించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Back to top button