టెక్నాలజీ

Kadiri Groundnut Variety: కదిరి వేరుశనగ రకంతో….అనంత రైతుల పంట పండుతోంది..!

అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించిన అధిక దిగుబడినిచ్చే వేరుశనగ విత్తన రకం కదిరి -1812

Kadiri Groundnut Variety

Kadiri Groundnut Variety: వ్యవసాయం భారమైన ఈ రోజుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వంగడాలు అందుబాటులోకి రావడంతో రైతులు తమకున్న కొద్దిపాటి పొలం, నీటితో నూతన వంగడాలను సాగు చేస్తూ అద్భుత ఫలితాలను సాధించి వ్యవసాయరంగానికి జీవం పోస్తున్నారు. ఇలాంటి తరుణంలో అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించిన అధిక దిగుబడినిచ్చే వేరుశనగ విత్తన రకం కదిరి -1812 . నూతనంగా అందుబాటులోకి వచ్చిన వేరుశెనగ విత్తన రకం
రాయలసీమ ప్రాంత రైతుసోదరులకు ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు వరంగా మారిందని చెప్పవచ్చు.

నూతనంగా అందుబాటులోకి వచ్చిన వేరుశెనగ విత్తన రకం కదిరి 1812 మామూలు వేరుశెనగ రకం కన్నా మూడు రెట్లు అధికంగా దిగుబడి వస్తోంది.ఒక్కో మొక్కకు దాదాపు 100 నుంచి 150 కాయల దిగుబడి వస్తుంది ఎకరాకు 45 నుండి 50 బస్తాల అధిక దిగుబడి వస్తోంది.
తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి ఇవ్వడంతో చాలా మంది రైతులు కదిరి 1812 వేరుశనగ రకంను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కదిరి రకం విత్తనాలకు మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పటికీ పెట్టుబడి తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా రైతుకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు వస్తుంది. పంట దిగుబడి ఎంత తక్కువగా ఉన్న 45 క్వింటాల్ తగ్గకుండా వస్తుంది.మార్కెట్లో కదిరి1812 విత్తనాలు క్వింటా రూ.2,200 ధర పలుకుతున్నాయి. అంటే రైతుకు ఎకరాకు రూ.99 వేలు ఆదాయం వస్తుంది.విత్తనం ఖర్చు, సేద్యపు ఖర్చులు పెట్టుబడి పోను ఎకరాకు రైతుకు రూ.50 వేలకు పైగానే మిగులుతోంది.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా కదిరి 1812 వేరుశెనగ విత్తన రకాన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాగుచేస్తున్న రైతుల అనుభవం ప్రకారం పంట కాలం మొత్తం కలిపి ఒక్కసారి మాత్రమే పురుగుల మందు పిచికారి చేసినా చీడపీడల ఉధృతిని బాగా తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చిందని రైతులు చెబుతున్నారు. అలాగే కాయలకు మార్కెట్ రేటు తగ్గినప్పటికీ
ఎక్కువ దిగుబడి వస్తుండడంతో లాభాలే వస్తున్నాయని చెప్పారు.ఈ రకం వేరుశనగకు చీడపీడలు అసలు ఆశించడంలేదని, దీంతో రైతులకు అదనపు ఖర్చు తగ్గుతాయన్నారు. గత రెండు నెలలుగా అప్పుడప్పుడూ ఓ మోస్తరుగా కురిసిన వర్షాలకు పలురకాల పురుగులు ఆశించినా ఈ రకం వేరుశనగ తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చిందని రైతుల అనుభవాలను పంచుకోవడం జరిగింది.

Back to top button