టాలీవుడ్వైరల్సినిమా

వైర‌ల్ః ప‌వ‌న్ సినిమాలో అనసూయ‌!

Anchor Anasuya
టాలీవుడ్ లో వ‌కీల్ సాబ్ మేనియా కొన‌సాగుతోంది. ఎన్నో అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ అందుకోవ‌డంతో.. అభిమానులు సంబ‌రాల్లో మునిగిపోయారు. యునానిమ‌స్ గా అన్ని వ‌ర్గాల నుంచీ పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ప‌వ‌ర్ స్టార్ కు తిరుగు లేకుండాపోయింది. ఇలాంటి స‌మ‌యంలో ఓ క్రేజీ న్యూస్ రివీల్ చేసింది హాట్ యాంక‌ర్ అన‌సూయ‌.

టాప్‌ యాంక‌ర్ గా ఆడియ‌న్స్ ను అల‌రించిన అన‌సూయ‌.. ఇప్పుడు సూప‌ర్బ్ ఆర్టిస్టుగా వెండితెర‌పై స‌త్తా చాటుతోంది. క్ష‌ణం, క‌థ‌నం, రంగ‌స్థ‌లం సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఆన‌సూయ‌.. ఇప్పుడు బ‌డా ప్రాజెక్టుల‌తో దూసుకెళ్తోంది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముటి సినిమాలో న‌టిస్తున్న బ్యూటీ.. కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ‌లోనూ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇంకా ప‌లు చిత్రాలు లైన్లో ఉన్నాయ‌నే ప్ర‌చారం సాగుతోంది.

అయితే.. సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అన‌సూయ‌.. త‌న లైఫ్ తోపాటు కెరీర్ విష‌యాల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. ఇవాళ పొద్దున్నే ఊహించ‌ని పోస్టుచేసి, ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఆ పోస్టులో త‌న ఆనందాన్ని కూడా వ్య‌క్తంచేసింది.

త్వ‌ర‌లో ప‌వ‌ర్ స్టార్ తో క‌లిసి ర‌చ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, చూసేందుకు మీరు సిద్ధంగా ఉండండి అంటూ పోస్టు చేసింది. అంతేకాదు.. ‘ఆ సంద‌డి మీకు చూపించ‌డానికి చాలా ఆతృత‌గా ఉంది’. అంటూ తన ఆనందాన్ని ప్రకటించింది. అయితే.. సినిమా ఏంటన్నది మాత్రం ఆమె ప్ర‌క‌టించ‌లేదు.

ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ష‌న్లో తెర‌కెక్కుతున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సెట్స్ పై ఉన్నాయి. వీటిల్లో వీర‌మ‌ల్లు చిత్రంలోనే అన‌సూయ క‌నిపించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఏ సినిమాలో న‌టిస్తుంది? ఎలాంటి క్యారెక్ట‌ర్లో న‌టిస్తోంది? అన్న‌ది చూడాలి.

Back to top button