టాలీవుడ్సినిమా

అనసూయ సంచలన నిర్ణయం.. హ‌ర్ట‌వుతున్న ఫ్యాన్స్‌!

Anasuya
సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ.. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన అన‌సూయ‌.. ఆ త‌ర్వాత వెండితెర‌పై ప్ర‌ధాన పాత్ర‌లు పోషించే స్థాయికి చేరింది. అన‌సూయ త‌మ సినిమాల్లో ఉంటే మంచి క్రేజ్ వ‌స్తుంద‌ని మేకర్స్ ఫీల‌య్యే వ‌ర‌కూ వ‌చ్చింది ఈ అమ్మ‌డి స్టార్ డ‌మ్‌. అయితే.. తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది అన‌సూయ‌. ఈ విష‌యం తెలిన వారు మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

Also Read: మ‌రో త‌మిళ్ రీమేక్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో చిరు?

అన‌సూయ కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. మొద‌ట్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించిన హాట్ బ్యూటీ.. ఆ త‌ర్వాత ‘క‌థ‌నం’ వంటి సినిమాల్లో లీడ్ రోల్స్‌ పోషించింది. అంతేకాదు.. ఇప్పుడు ఔటాఫ్ టాలీవుడ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైందీ బ్యూటీ. ఇప్పటికే తన కోలీవుడ్ డెబ్యూ మూవీకి సైన్ చేసిన‌ అనసూయ.. మలయాళం ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టబోతోంది.

ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో నటిస్తోంది అనసూయ. చిరంజీవి ఆచార్యతోపాటు, అల్లు అర్జున్ ‘పుష్ప’ మలయాళ మూవీ ‘భీష్మ పర్వం’లోనూ యాక్ట్ చేస్తోంది. ఇంకా.. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ప్రాస్టిట్యూట్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. దాంతోపాటు సునీల్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

Also Read: 2021లో రికార్డ్: ఉప్పెన కలెక్షన్స్ 21 కోట్ల టార్గెట్ కు 10 రోజుల్లో వచ్చింది ఇదీ

కాగా.. ఇప్పటి వరకూ కొన్ని ఐటం సాంగ్స్ కూడా చేసింది అనసూయ. సాయి ధరమ్ తేజ్.. ‘విన్నర్’ తన పేరుమీదనే రాసిన పాటలో ఆడిపాడిందీ చిన్నది. తాజాగా.. ‘చావు కబురు చల్లగా’ సినిమాలోనూ ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమాలో అనసూయ చేసిన పాట లిరిక్స్ తోనే ఫుల్ ఫేమస్ అయ్యింది. ‘అవసరమని వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక ఆడుకుంటారు’ అంటూ సాగే పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే.. ఈ సినిమా తర్వాత తాను ఇక ఐటెం సాంగ్ చేయనని తేల్చి చెప్పింది అనసూయ. అంతేకాదు.. ఇకపై వచ్చే సినిమాల్లో తన పాత్ర నచ్చితేనే నటిస్తానని కూడా చెబుతోంది. అనసూయ ఐటం సాంగ్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అనసూయ డెసిషన్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు, చేస్తేనే బాగుంటుందని అంటున్నారు. మరి, అనసూయ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button