వైరల్సినిమా

పెళ్లికి రెడీ అంటున్నా.. బుల్లితెర రాములమ్మ

Sreemukhi

బుల్లితెర రాములమ్మ పెళ్లికి శ్రీముఖి రెడీ అంటోంది. నేనిప్పుడు సింగిలే మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని అంటోంది. టాలీవుడ్ లోకి నటిగా అడుగుపెట్టి తరువాత యాంకర్ గా మారింది శ్రీముఖి. ప్రస్తుతం సుమ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ కలిగి ఉండి, ఎక్కువ షోలు చేస్తున్న లేడీ యాంకర్ గా ఉంది.

Also Read: హిటెక్కుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్.. టాప్-5లో ఉండేది వీరేనా?

యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. శ్రీముఖి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయంలో తన పేరెంట్స్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. అయితే ప్రస్తుతం ఆమె ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు హాట్ టాపిక్ వినిపిస్తోంది.

మంచి అబ్బాయి దొరికితే లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంటదట. కానీ డైరెక్టుగా పెళ్లి చేసుకోదట. రెండు సంవత్సరాలు (అబ్బాయితో, వాళ్ల కుటుంబంతో) ప్రయాణం చేశాక, నచ్చితే పెళ్లి చేసుకుంటుందట.

కష్టపడి సంపాదించినప్పుడు ప్రతి రూపాయి ముఖ్యమేనని. అలాగనీ నేను పిసినారి అని చెప్పను. నాకంటూ ఓ చెక్‌ లిస్ట్‌ ఉంది. మంచి ఇల్లు తీసుకోవాలి. మమ్మీడాడీ కంటూ ఒక ఇల్లు ఉండాలి. తమ్ముడు, కజిన్స్‌ని సెటిల్‌ చేయాలి. తమ్ముడి కోసమే లగ్జరీ కారు కొన్నా. పెళ్లైన తర్వాత భర్త మీద అస్సలు ఆధారపడకూడదని అంటోంది ఈ అందాల భామ.

Also Read: అల్లు అర్జున్ కూతురు అర్హ.. వీడియో చేసింది అతడేనా?

ఆడపిల్లలకు ముందు నుంచీ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ మీద ఓ స్పష్టత ఉంటుందని.. అందులోనూ కష్టపడి సంపాదిస్తున్నారంటే మరింత జాగ్రత్తగా ఖర్చు చేస్తారని అంటోంది శ్రీముఖి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button