టాలీవుడ్తెలంగాణరాజకీయాలుసినిమా

  గళగళ మాట్లాడే సుమ.. కేటీఆర్ మాటలకు స్టన్ అయిపోయింది.. ఎందుకు?

Anchor Suma Surprise for KTR Speech

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ సుమ కనకాల స్టార్డమ్ తెచ్చుకుంది. నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ బాగా సంపాదిస్తుంది. బుల్లితెరపై యాంకరింగ్.. హోస్ట్ గా చేస్తునే సినిమా ఈవెంట్లలో సందడి చేస్తుంటోంది. బుల్లితెర ప్రేక్షకుల చేత సుమక్కగా పిలిపించుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటోంది.

గళగళ మాట్లాడుతూ యాంకరింగ్ చేసే సుమను కూడా కేటీఆర్ మాటాలు స్టన్ అయ్యేలా చేశాయి. ఈ విషయాన్ని సుమనే తాజాగా వెల్లడించింది. తన ఇన్ స్ట్రాగ్రాంలో మంత్రి కేటీఆర్ తో దిగిన పిక్స్ షేర్ చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ సర్ తో తాను సంభాషించడం ఆనందంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఇన్ స్ట్రాగ్రామ్ లో కేటీఆర్ గురించి ఓ ఆసక్తికర మేసేజ్ పెట్టింది. ‘నేను షోలలో గడగడ ఆపకుండా మాట్లాడుతుంటా.. కానీ మీ (కేటీఆర్) నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసింది.. ప్రకటించడం.. అంకిత భావంతో పని చేయడం.. అమలు చేయడం.. మీ మార్గాలు.. సూపర్ సర్..’ అంటూ ఇన్ స్ట్రా పోస్టు పెట్టింది.  ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సుమ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే కేటీఆర్ ను ఆమె ఇంటర్వ్యూ చేసినట్లుగా ఉంది. కేటీఆర్ కు భాగ్యనగరం అభివృద్ధితోపాటు పలు అంశాలపై మంచి విజన్ ఉందని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఆమె ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు.

మీతో సంభాషించడం నాకు కూడా ఆనందాన్ని ఇచ్చిందని.. ఈ వీడియో చూసే ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రిప్లయ్ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది.

Back to top button