టెక్నాలజీ

మీ మొబైల్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. ప్రమాదంలో పడ్డట్టే..?

మన దేశంలో సంవత్సరం సంవత్సరానికి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని కొందరు హ్యాకర్లు యాప్స్ ద్వారా ఫోన్లలోని మాల్వేర్ ప్రవేశించేలా చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ గడిచిన మూడు సంవత్సరాలుగా జోకర్ మాల్ వేర్ వల్ల కొన్ని యాప్స్ ను తొలగిస్తూ వస్తోంది. తాజాగా క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ గూగుల్ ప్లే స్టోర్ లోని ఎనిమిది యాప్స్ లో జోకర్ మాల్వేర్ ను గుర్తించింది.

దీంతో ఈ ఎనిమిది యాప్స్ ను ప్లే స్టోర్ తొలగించడం గమనార్హం. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లు వెంటనే ఈ యాప్స్ ను తమ మొబైల్ నుంచి తొలగించాలని సూచనలు చేయడం గమనార్హం. గూగుల్ ప్లే స్టోర్ తొలగించిన యాప్స్ జాబితాలో ఆక్సిలరీ మెసేజ్, ఫ్రీ క్యామ్ స్కానర్, ఫాస్ట్ మ్యాజిక్ ఎస్.ఎం.ఎస్, ఎలిమెంట్ స్కానర్, సూపర్ మెసేజ్, ట్రావల్ వాల్ పేపర్స్, గో మెసేజెస్, సూపర్ ఎస్.ఎం.ఎస్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే మాత్రం వెంటనే యాప్స్ ను డిలేట్ చేస్తే మంచిది.

కొన్ని యాప్ ల ద్వారా జోకర్ మాల్ వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. ఈ మాల్వేర్ ఉన్న ఫోన్ యూజర్ల ప్రమేయంతో సంబంధం లేకుండా కొన్ని రకాల ప్రీమియం సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసుకుంటుంది. అదే సమయంలో గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ కు రొరకకుండా కొన్ని చిన్నచిన్న కోడ్ లను వినియోగిస్తుంది. ఈ మాల్వేర్ వినియోగదారుల మెసేజ్ లు, కాంటాక్ట్ లిస్ట్ కు సంబంధించిన వారి వివరాలను సైతం సేకరిస్తుంది.

ఫోన్ లో జోకర్ మాల్వేర్ ఉన్న యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న వాళ్లు ఫోన్ నుంచి వెంటనే ఈ యాప్స్ ను తొలగిస్తే మంచిది. ఈ యాప్స్ ఫోన్ లో ఉంటే మాత్రం ఫోన్ కు సంబంధించిన పూర్తి సమాచారం సైబర్ నేరగాళ్లకు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Back to top button