టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

నాగార్జున గారు ఏమనుకుంటారో ? బాధలో స్టార్ డైరెక్టర్ !

Anil Ravipudiఅక్కినేని నాగార్జున గారికి ఏం చెప్పాలి, ఆయన ఏమనుకుంటారో ? ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాధ ఇది. అన్నీ సజావుగా వుండి వుంటే ఈ పాటికి, నాగార్జునతో చక్కగా మీటింగ్స్ లో కూర్చుని, అఖిల్ తో చేయనున్న సినిమా కథ పై చర్చిస్తూ ఉండేవాడు. కానీ, ఇప్పుడు కథ రెడీగా ఉన్నా, చర్చించడానికే టైం లేకుండా పోయింది. ఒకపక్క నాగ్ నుండి ఫోన్లు వస్తున్నాయి.

మరోపక్క బాలయ్యతో సినిమా ఒప్పందం కుదిరిపోయింది. అటు రవితేజ – రామ్ ల కలయికలో ఓ సినిమా చేయాలనే ప్రపోజల్ ఎప్పటినుంచో ఉంది. నాగార్జున కూడా దాదాపు ఆరేళ్ళ నుండి అనిల్ రావిపూడిని సినిమా చేసి పెట్టమని అడుగుతున్నాడు. నిజానికి ‘పటాస్’ సినిమా రిలీజ్ అయినప్పుడు పిలిచి మరీ నాగ్, అనిల్ రావిపూడిని అభినందించాడు. పైగా అప్పుడే కథ ఉంటే చెప్పమని ఆఫర్ కూడా ఇచ్చాడు.

అప్పటి నుండి అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేసి పెట్టమని, నాగార్జున ఓపెన్ గానే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందుకే అనిల్ రావిపూడి ఈ ఏడాది అఖిల్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అలాగే వచ్చే ఏడాది బాలయ్యతో సినిమాకు ఆల్ రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, కానీ సడెన్ గా కరోనా సెకెండ్ వేవ్ వచ్చి, మళ్ళీ అందర్నీ బాధ పెడుతుంది. దీనికితోడు ‘ఎఫ్ 3’ సినిమా మధ్యలోనే ఆగింది. మరో నెల తరువాత అయినా షూటింగ్ మొదలైనా, ఎఫ్ 3 ఈ ఏడాది పూర్తి అయ్యేలా లేదు.

ఎందుకంటే వెంకీ ‘ఎఫ్ 3’ ప్రాజెక్టు మీదకు రావడానికి మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో ఈ ఏడాది అక్టోబర్ నుండి అఖిల్ తో అనిల్ రావిపూడి చేయాలనుకున్న సినిమా సాధ్య పడేలా లేదు. అఖిల్ తో సినిమా చేయాలని తనకు ఉన్నా, పైగా నాగార్జునకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఉన్నా… సినిమా చేసే పరిస్థితిలో అనిల్ రావిపూడి లేడు.

Back to top button