బాలీవుడ్సినిమా

కరణ్ జోహర్ పై మరో వివాదం.. టైటిల్ రచ్చ..!

Karan Johar

బాలీవుడ్లో ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించడంలో కరణ్ జోహర్ కు మంచి పేరు ఉంది. కరణ్ జోహర్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా.. టీవీ వ్యాఖ్యాతగా.. క్యాస్టూమ్ డిజైనర్.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కరణ్ జోహర్ పై నిత్యం ఏదో వివాదం నెలకొంటూనే ఉంటుంది. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య విషయంలో కరణ్ జోహర్ పేరు కూడా ప్రముఖంగా విన్పించింది.

Also Read: ఎట్టకేలకు కియారా కోరిక తీరబోతుంది !

కరణ్ జోహర్ సినిమా ఆఫర్లను నిరాకరించడంతో సుశాంత్ రాజ్ ఫుత్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. తాజాగా కరణ్ జోహర్ పై ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ కాపీ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.మాధుర్ బండార్కర్ గతంలో చాందిని బార్.. కార్పొరేట్.. ట్రాఫిక్ సిగ్నల్.. ఫ్యాషన్ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను తీశాడు. ఈ మూడు చిత్రాలకూ జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలేవీ సరిగా ఆడకపోయిన ఆయన మాత్రం సినిమాలు తీయడం ఆపడం లేదు.

తాజాగా మధూర్ బండార్కర్ కొత్తగా ‘బాలీవుడ్ వైవ్స్’ పేరుతో ఓ సినిమా తీయాలని భావించాడు. ఈ టైటిల్‌‌ను కూడా రిజిస్టర్ చేయించుకొని స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అయితే ఈ టైటిల్‌ను కరణ్ జోహర్ మరో రకంగా వాడటంపై మధూర్ బండార్కర్ మండిపడుతున్నాడు. కరణ్ జోహర్ అపూర్వ మెహతాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ టైటిల్ తన దగ్గర కాపీ కొట్టిందేనంటూ మధూర్ బండార్కర్ సోషల్ మీడియాలో ఆరోపించారు.

Also Read: కంగనా మీదికి వర్మ ‘శశికళ’ కత్తి

తాను ‘బాలీవుడ్ వైవ్స్’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకోగా ఆ టైటిల్ తనకు కావాలని కరణ్ అడిగాడని చెప్పుకొచ్చాడు. దానిని తాను సున్నితంగా తిరస్కరించడంతో తన టైటిల్‌ను కొంచెం మార్చి అనైతికంగా ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’తో వెబ్ సిరీస్ తీసేసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశాడని ఆరోపించాడు. వెంటనే ఆ టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాడు. దీనిపై కరణ్ ఎలా స్పందిస్తాడో వేచూడాల్సిందే..!

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

Back to top button