ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మరో షాకింగ్ న్యూస్..?

భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వచ్చిన విషయం మరింత భయాందోళనకు గురి చేస్తోంది. వైద్య నిపుణులు కరోనాను తగ్గించడానికి వాడే మందుల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు చెప్పారు.

కరోనా చికిత్సలో భాగంగా వినియోగిస్తున్న స్టెరాయిడ్స్ వల్ల కోలుకున్న వారిలో కంటిచూపు మందగిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని స్టెరాయిడ్స్ లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎలాంటి కంటి సమస్యలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులతో బాధ పడేవాళ్లకు స్టెరాయిడ్స్ ను వినియోగిస్తే మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తే స్టెరాయిడ్స్ ఇస్తారని.. ఆ స్టెరాయిడ్స్ భవిష్యత్తులో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ను చూపుతాయని వెల్లడించారు. స్టెయిరాడ్స్ తీసుకున్న వాళ్లు కంటి డాక్టర్ ను సంప్రదిస్తే మంచిదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే ప్రజలు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇదే సమయంలో వైరస్ గురించి కొత్తగా వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసే విధంగా ఉండటం గమనార్హం.

Back to top button