సినిమాసినిమా వార్తలు

మరో ట్విస్ట్: ‘మా’ ఎన్నికల్లో జీవిత

Another twist: life in ‘maa’ election

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘(మా) ఎన్నికల్లో ఇప్పటికే ప్రకాష్ రాజ్ తోపాటు మంచు మిష్ణు కూడా పోటీపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు కూడా ఇచ్చారని అంటున్నారు. అయితే సడెన్ గా ఇప్పుడు మా ఎన్నికల్లో మరో పోటీదారు తెరపైకి వచ్చారు.

నటి జీవితా రాజశేఖర్ కూడా మా ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీ అయ్యారట.. మా అధ్యక్ష పదవికి ఆమె పోటీచేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే మా వేదికపై రాజశేఖర్ , చిరంజీవి వాదులాడుకోవడం.. చిరంజీవి ఆవేశంగా వేదిక మీదే మాట్లాడడంతో జీవితకు వ్యతిరేకంగా మెగాస్టార్ పనిచేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం జీవిత ‘మా’ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇటీవల అధ్యక్షుడు నరేశ్ గైర్హాజరీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. జీవితకు ప్రస్తుత మా వర్గం బలమైన సపోర్టుగా ఉంది. జీవిత బరిలోకి దిగితే అటు ప్రకాష్ రాజ్ కు, ఇటు మంచు విష్ణుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఇక జీవిత మా ఎన్నికల్లో పోటీచేయడం.. ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించిన చిరంజీవిని ఇబ్బందుల్లో నెట్టేస్తుంది. ఈ క్లిష్టమైన పరిస్థితిని చిరంజీవి ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తి రేపుతోంది.

Back to top button