అప్పటి ముచ్చట్లుసినిమా వార్తలు

అందుకే అక్కినేని ప్రత్యేకంగా ఇష్టపడ్డారు !

ANR
అక్కినేని నాగేశ్వరరావుగారికి ఆయన సినిమాల అన్నిటిలో కల్లా ఒక సినిమా అంటే ప్రత్యేకమైన ఇష్టం అట. ఇంతకీ ఏమిటి ఆ సినిమా అనుకుంటున్నారా.. ? దానికి కంటే ముందు అక్కినేని ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లల్లో అనగా 1941లో నటుడుగా ప్రవేశించిన “ధర్మ పత్ని” సినిమా అంటే అక్కినేనికి ఇష్టమే. అలాగే 2014లో వచ్చిన ఆయన చివరి సినిమా ‘మనం’ అన్నా కూడా అక్కినేని ప్రత్యేకమైన అభిమానమే. కానీ ఆయన నట జీవితం 73 సంవత్సరాల్లో ఆయన నటించిన 244 సినిమాల్లో ఒక సినిమా మాత్రం ఆయన మనసుకు బాగా హత్తుకుపోయిందట.

ఆ సినిమానే ‘బాటసారి’. నిజానికి ఈ సినిమా గొప్ప హిట్ సినిమా ఏమి కాదు, అసలు అక్కినేని నటించిన గొప్ప సినిమాల లిస్టులో ఈ సినిమా అసలు ఉండకపోవచ్చు. అయినా ఆ సినిమా అంటే అక్కినేనికి ఎందుకు అంత ఇష్టం అని చాలా మంది అడిగినా ఆయన మాత్రం అసలు కారణం చెప్పకుండా.. తెలివిగా మరో సమాధానం చెబుతుండేవారట. అయితే ఓ ప్రముఖ పత్రికకు అక్కినేని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “మీకు బాగా నచ్చిన ఒకే ఒక్క సినిమా చెప్పండి ?“ అని అడిగారు. అక్కినేని ఎప్పటిలాగే తడుముకోకుండా “బాటసారి ” అని చెప్పారు.

“అదేమిటి చాలామంది మీకు బాగా ఇష్టమైన సినిమా అనగానే ముందు “దేవదాస్ ” అని చెబుతారు. మీరు కూడా అదే చెబుతారు అనుకున్నా” అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు.. అక్కినేని సమాధానం చెబుతూ “బాటసారి సినిమా నిర్మించింది భరణీ సంస్థ. ఇది 1961లో విడుదలైంది. ఇందులో సురేంద్రుడుగా నేను మాధవిగా భానుమతి నటించాము. అయితే ఈ సినిమాలో నా పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.

అందుకే నా పాత్ర పోషణ కోసం నేను అప్పట్లో చాలా కష్ట పడ్డాను కూడా. ఎందుకంటే సురేంద్రుడు పాత్ర తెలివితో పాటు మంచి తనంతో సాగే ఒట్టి అమాయకుడి పాత్ర. ఒకేసారి చాల భావాలను పలికించాల్సి వచ్చేది. ఇక మాధవి బాల్య వితంతువు, పైగా ఆమెకు మగవారి నీడ కూడా పడదు. అలాంటి వీరిద్దరి మధ్య గాఢమైన బంధం ఎలా పుట్టింది ? అసలు సురేంద్రుడు కనీసం ఒక్కసారి కూడా ఆమెకు దగ్గరగా చూడకుండా ఎందుకు ఆమెను అంతలా ప్రేమించాడు ? చాలా పవిత్రమైన ప్రేమ. అందుకే ఆ పాత్ర నాలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది” అని అక్కినేని చెప్పారు.

Back to top button