క్రీడలుబాలీవుడ్సినిమా

ఫోటో షేర్ చేసి కూతురి పేరు రివీల్ చేసిన ‘విరుష్క’

Virushka Baby Name
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017 లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుండి అన్యోన్యంగా కలిసి ఉంటూ 2021, జనవరి 11 న ఈ దంపతులిద్దరూ ఆడపిల్లకి జన్మనివ్వటంతో తల్లి దండ్రులుగా ప్రమోట్ అయ్యారు. వారి పాపని చూడటానికి దేశమంతా కళ్లప్పగించుకుని ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది అనుష్క.

Also Read: బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్తూ మీడియాకి దొరికిన మహేష్ హీరోయిన్

‘మేము ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయలతో నిండిన జీవితాన్ని గడిపాం. “వామికా” ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన.. ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అని పేర్కొంటూ అనుష్క, భర్త విరాట్ తో కలిసి కూతురిని చూస్తూ ఆనందపడుతున్న ఫోటోని పోస్ట్ చేసింది.

Also Read: మరో ఐకానిక్ లీడర్ పాత్రలో కంగనా

ఇన్నాళ్లు పాపకి ‘విరుష్క’ , ‘అన్వీ’ అనే పేర్లు పెడతారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. వామికా పేరు కొత్తగా బాగుందనుకుంటూ… ఆ పేరుకి అర్ధం ఏంటా అని కూడా వెతుకుతున్నారు. మన పురాణాల ప్రకారం వామిక అంటే దుర్గామాత అనే అర్ధం వస్తుంది. తల్లి దండ్రులలానే ఈ బుజ్జి పాప భవిష్యత్ లో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ కామెంట్స్, లైక్స్ పెడుతూ ఫ్యాన్స్ ఆ పోస్ట్ ని వైరల్ చేసేసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్.

Back to top button