గుసగుసలుసినిమాసినిమా వార్తలు

అనుష్క పెళ్లి ఫిక్స్.? ప్రభాస్ తో కాదు!

Anushka wedding fix.? Not with Prabhas!

అప్పుడెప్పుడో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ అగ్రహీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయిన పరిస్థితుల్లో సీనియర్ హీరోయిన్ అనుష్క పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ తో లవ్ లో ఉందని.. అందుకే పెళ్లి చేసుకోవడం లేదని ఎన్నో పుకార్లు షికార్లు చేసినా వీరి ద్దరి పెళ్లి పట్టాలెక్కలేదు. తాజాగా అనుష్కకు సంబంధం చూశారని అది ఓకే అయ్యిందని సమాచారం. అనుష్కకు తొందరగా పెళ్లి చేస్తేనే ఈ వార్తలకు పులిస్టాప్ పడుతుందని ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు.

కాగా అనుష్కకు దుబాయ్ లోని ఓ బిజినెస్ మేన్ కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. అనుష్క సైతం ఈ పెళ్లికి ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా ఉధృతి ఉన్నందున కాస్త సమయం తీసుకుంటున్నారట. ఈ బెడద తీరాక అనుష్క పెళ్లి చేసుకోవడం ఖాయమంటున్నారు.

అయితే అనుష్క పెళ్లి చేసుకునే అబ్బాయి విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. అనుష్క చేసుకోబోయే వరుడు ఆమె కంటే రెండేళ్లు చిన్నోడు అట.. అయితే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అనుష్కకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పింది. దీంతో వీరి పెళ్లి ఖాయమైంది. ఏదైతేనేం మొత్తానికి అనుష్క పెళ్లి కూతురవుతున్నందుకు అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.ఇక ప్రభాస్ తో ముడిపెట్టడం కూడా ఉండదంటున్నారు.

తెలుగులో అనుష్క మొదట సినిమా ‘సూపర్’. అక్కినేని నాగార్జున పక్కన హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తరువాత చిన్నా,పెద్ద హీరోలందరితో సినిమాలు చేసింది. బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి అగ్రహీలతో కలిసి చేసిన ఈ భామ ప్రభాస్ తో కలిసి బిల్లా, బాహుబలి సినిమాల్లో మెరిసింది. అయితే ప్రభాస్, అనుష్కల మధ్య ఏదేదో ఉందని పుకార్లు వచ్చాయి. చివరికి వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. చివరకు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అనుష్క రెడీ అయినట్టు ప్రచారం సాగుతోంది.

Back to top button