ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

AP: సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు

CBI, ED court summons CM Jagan

Article 360 in AP

వాన్ పిక్ ఈడీ కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఏపీ సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు, ఐఆర్టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామిక వేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం. శామ్యూల్, మన్మోహన్ సింగ్, జగతి పబ్లికేషన్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

Back to top button