ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

AP Cabinet sensational decisions

ఏపీలో ప్రబలుతున్న కరోనాను ఎలా కట్టడి చేయాలి? దీనికి అనుసరించాల్సిన వ్యూహాలను ఎలా సిద్ధం చేయాలి? మరోసారి లాక్ డౌన్ దిశగా వెళ్లకుండా ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు.

ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట కర్ఫ్యూను విధించాలని నిర్ణయించింది.

సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాత్రి కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలో ఆర్టీసీ సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. దూర ప్రాంతం, అంతర్రాష్ట్ర సర్వీసులతోపాటు ఇరత ప్రాంతాలకు వెళ్లే వాహనాలు రద్దు చేశారు.

ఇక ఏపీలోని ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదని.. పడకలు లేక కొందరు చనిపోతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో సుమారు 50వేల బెడ్ లు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. తగిన ఆక్సిజన్ రవాణాకు విదేశాల నుంచి ట్రక్కులు కొనుగోలు చేయాలని చర్చించారు.

ఇక 18-45 ఏళ్ల వారికి టీకా వేసేందుకు వీలుగా నిధుల కేటాయింపుపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. టీకా కొరత ఉండడంతో కొనుగోళ్లపై చర్చించారు.

ఇక ఏపీలో రైతు భరోసా కింద తొలివిడత 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4040 కోట్లు మ చేసేందుకే కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబెస్ బోధించాలని నిర్ణయించారు. అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేలకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయించారు. ఇమామ్ లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంచారు.

ఏపీలో మూసేసిన డెయిరీలను అమూల్ కు లీజుకు ఇవ్వాలని.. దాదాపు 708 గ్రామాల్లో అమూల్ సేవలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

Back to top button