ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్

’అభయ్ యాప్‘ ను ప్రారంభించిన ఏసీ సీఎం

Ap cm launches 'Abhay' app in andhrapradesh.

మహిళలు,చిన్నారుల భద్రత కోసం రూపొందించిన ‘అభయ్’ యాప్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. రవాణాశాక పర్యవేక్షణలో నడిచే ఈ యాప్ ను జగన్ వర్చువల్ ద్వారా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదన్నారు.   ఆటోలు, క్యాబల్ లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని పట్టుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా.. కేంద్రప్రభుత్వం 58.64 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సమకూర్చనుంది. దశలవారీగా రాష్ట్రంలో లక్ష రవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైజ్ లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

Back to top button