ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ఏపీ కౌంటర్

AP counter in High Court on Rua Hospital incident

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై  హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సకాలంలో రాకపోవడం వల్లే రోగులు మృతి చెందారని వెల్లడించిది. ఆక్సిజన్ రావడంలో జాప్యంతోనే 23 మంది మరణించినట్లు అఫిడవిట్ సమర్పించింది. ఆక్సిజన్ సరఫరా కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు కోర్టుకు తెలిపింది. గత మే నెలలో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం నెలకొని కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Back to top button