అత్యంత ప్రజాదరణవిద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో 20 వేల ఉద్యోగాల భర్తీ..?

AP Sarkar Ugadi Job Notification Released

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ రాష్ట్రంలో 20వేల ఉద్యోగ ఖాళీల భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఉగాది రోజున సీఎం జగన్ వేర్వేరు శాఖల్లో ఖాళీగా ఉన్న 20,000 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారని సమాచారం.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో వెల్లడించారు. ఈ ఉద్యోగాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు, సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల్లో కూడా వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సేవలందించాలని జగన్ స్పష్టం చేశారు.

రైతు భరోసా కేంద్రాలలో కియోస్క్ ద్వారా పశువుల దాణాతో పాటు మందులను ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలని, వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్‌ ట్యాగ్‌ చేయించాలని జగన్ అధికారులకు సూచించారు. ఈ ఉద్యోగాలతో పాటు ఏడాదికి 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఉగాది రోజున విడుదలయ్యే జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Back to top button