ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

పావలా వడ్డీ బకాయలు చెల్లించని ఏపీ ప్రభుత్వం!

తీవ్రమైన ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులను దాదాపు నిలిపి వేయడంతో పావలా వడ్డీ పథకం కింద రైతులకిచ్చిన రుణాలకు గానూ బ్యాంకులకు రీయంబర్స్‌ చేయాల్సిన మొత్తం భారీగా పేరుకుపోతోంది. ఈ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం ఉండటం లేదు.

దీని ప్రభావం పథకం అమలుపై పడే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. తాజా సమాచారం ప్రకారం దాదాపుగా రూ 650 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాల్సిఉంది. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పేరిట చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేరదుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా తీసుకున్న రుణానికి రైతుల పావలా వడ్డీని చెల్లిస్తుండగా, మిగిలిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిఉంది. అయితే, 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి ఈ మొత్తంలో ఎంతో కొంత ప్రభుత్వం ప్రతి ఏడాది బకాయి పడుతూనేఉంది. ఇలా రూ 874 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సిఉండగా, అరదులోరూ 224 కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరాయి. ఇరకా రూ 650 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉంది.

తాజాగా జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో కూడా ఇదే అరశాన్ని బ్యాంకు అధికారులు లేవనెత్తడం, త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్ధికశాఖ చెప్పడం జరిగింది. 2011-12లో ఆరు లక్షల రూపాయలు రావాల్సి ఉండగా, అది ఇప్పటివరకు అందలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

అలాగే 2012-13లో రూ 27.74 లక్షలు రావాల్సి ఉండగా, అందులో రెండు లక్షల రూపాయలు బ్యాంకులకు చేరలేదు. 2013-14లో రూ 26 కోట్లు, 2014-15లో రూ 3.77 కోట్లు, 2015-16లోరూ 3.30 కోట్లు బకాయిలు ఉండగా, 2016-17లో ఏకంగా రూ 221 కోట్లు, ఆ తరువాత సంవత్సరం రూ 310 కోట్లు బకాయిలు ఉండిపోయాయి.

ఈ బకాయిల ప్రభావం తమ దైనందిక లావాదేవీలపై పడుతోందని బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

.