విద్య / ఉద్యోగాలు

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

AP Grama Volunteer Recruitment 2021

ఏపీ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 200 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 13వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 200 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కృష్ణా జిల్లా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పది, ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు.

మొత్తం 100 మార్కులకు జరిగే ఈ ఇంటర్వ్యూలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన ఉన్నవాళ్లు సులభంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం లభిస్తుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉండాలి.

https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మరోవైపు భవిష్యత్తులో ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు వేతనాలు పెంచే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

Back to top button