విద్య / ఉద్యోగాలు

ఏపీలో గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. 539 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జిల్లా సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ప్రభుత్వ పథకాలమీద పూర్తి అవగాహన ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. . ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండటంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ తెలుగు రాయడం, చదవడం తెలిసి ఉండాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉండగా ప్రభుత్వ పథకాలపై అవగాహన, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం మే నెల 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 5,000 రూపాయల గౌరవ వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు కేటాయించిన ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందించాల్సి ఉంటుంది.

ఏపీలో మొత్తం 2,70,000 గ్రామ, వార్డు వాలంటీర్లు పని చేస్తున్నారు. ఎవరైనా ఈ ఉద్యోగాలకు వేర్వేరు కారణాల వల్ల రిజైన్ చేస్తే ఇతరులతో ఆ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.

Back to top button