ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ : జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

దమ్మాలపాటిఫై చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు..

is Jagan making a mistake by giving priority to those leaders
అమరావతి రాజధాని భూకుంభకోణంలో తీగ లాగుతున్న వైసీపీ సర్కార్ ఇందులో చంద్రబాబు హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ కు కూడా ఉచ్చు బిగిసేలా చేసింది. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు న్యాయ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన దమ్మాలపాటిని ఇరికించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది.  ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

Also Read: నేలవిడిచి సాము చేస్తున్న జగన్

రాజధాని భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. దుమ్మాలపాటి తరుఫున భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు అయోగాలు మోపారని పిటీషన్ తరుఫు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు.

Also Read: న్యాయవ్యవస్థలోనూ అమరావతి భూకుంభకోణం లింకులు?

విచారణ సందర్భంగా అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది. అనంతరం దుమ్మాలపాటి శ్రీనివాస్ పై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. అలాగే ఎఫ్ఐఆర్ లోని సమాచారాన్ని కూడా ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Back to top button