ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే..: ఏపీలో ప్రతిపక్షాల డిమాండ్‌

AP High Court
ఏపీలో ఇప్పటికే నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించాలని ఎస్‌ఈసీ ఈ మేరకు నిర్ణయించారు. పరిషత్ ఎన్నికల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు.కానీ.. రాజకీయ పార్టీలు ఈ విషయంలో మాత్రం అసంతృప్తితో ఉన్నాయి.

Also Read: నేడు ఏపీ కేబినెట్ భేటి.. కీలక నిర్ణయాల దిశగా జగన్

మొదటి విడత జరిగిన ఎన్నికల్లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని.. కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదని.. అంతే కాకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అవుతోందని ఇప్పుడా ప్రక్రియ కొనసాగించడం కరెక్ట్ కాదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన కూడా పిటిషన్లు దాఖలు చేసింది.

ఇక్కడ విచిత్రం ఏంటంటే పరిషత్ ఎన్నికల విషయంలో ఏకగ్రీవాల విషయంలో విచారణ జరపాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ వాదనకు కాస్త మద్దతుగా హైకోర్టు తీర్పు వచ్చింది. ఫామ్ -10 ఇచ్చిన చోట విచారణ వద్దని ఆదేశించింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అసలు కొత్త నోటిఫికేషన్ కావాలని.. పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతుండడం గమనార్హం. కోర్టు కూడా ఎన్నికల వివాదాల విషయంలో మధ్యే మార్గంగా ఉత్తర్వులు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.

Also Read: అక్కడ టీడీపీ ఆశలు గల్లంతేనా..!

ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక్క వైసీపీ మినహా.. మిగితా పార్టీలన్నీ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కొత్తగానే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నాయి. ఈ పిటిషన్లపై విచారణలో ఒకవేళ ఎస్ఈసీ కూడా తన అభిప్రాయం అదేనని కోర్టుకు చెబితే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. కోర్టుల్లో ఈ పిటిషన్లన్నీ పరిష్కారం అయితేనే ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే వాయిదాలు పడినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా ఏపీలో మరోసారి ఎన్నికల కోసం కోర్టు తీర్పు కోసం వెయిట్‌ చేయక తప్పడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button