విద్య / ఉద్యోగాలు

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రూ.56,000 వేతనంతో..?

AP Water Resource Department Recruitment 2021

ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 7 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 15 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://irrigationap.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలలో హైడ్రాలజిస్ట్‌ ఉద్యోగ ఖాళీ ఒకటి ఉండగా కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ మూడు ఉద్యోగ ఖాళీలు, అకౌంటెంట్ ఒక ఉద్యోగ ఖాళీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. హైడ్రాలజిస్ట్ ఉద్యోగాలకు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.56,000 వేతనంగా లభిస్తుంది. కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కెమిస్ట్రీలో బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ పాసై ఉండటంతో పాటు రెండు సంవత్సరాల ల్యాబ్ అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 24,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కడప, గుంటూరు వాటర్‌ క్వాలిటీ ల్యాబ్స్‌ లో పని చేయాల్సి ఉంటుంది.

అకౌంటెంట్‌ ఉద్యోగాలకు ఎంకాం, బీకాం పాస్ కావడంతో పాటు పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉండగా 17,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. డేటాఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయల చొప్పున వేతనం లభిస్తుంది.

ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు cehydrology@ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Back to top button