విద్య / ఉద్యోగాలు

ఏపీ కరెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 86 జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ – 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలులో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 3వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://apcpdcl.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలనే ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారానే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే ఆ తప్పులను మార్చుకునే ఉంది. మే నెల 10వ తేదీ నుంచి మే నెల 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే నెల 18వ తేదీ నుంచి మే నెల 22వ తేదీలోపు హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే నెల 23వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు రాతపరీక్ష జరగనుంది. మే నెల 31వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించనున్నారు. ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.15,000 వేతనంగా లభిస్తుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 700 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 350 రూపాయలుగా ఉంది.

Back to top button