జనరల్విద్య / ఉద్యోగాలు

బీటెక్ పాసైన యువతులకు శుభవార్త.. ఏపీలో 100 ఉద్యోగాలు..?

APSSDC

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. శ్రీసిటీలోని ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో 100 ఉద్యోగాల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ పాసైన యువతులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 5వ తేదీ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. క్యాప్ జెమిని కంపెనీలో 30 వేల ఉద్యోగాలు..?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ విభాగాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018, 2019, 2020లో బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 13 వేల రూపాయల వేతనం లభిస్తుంది. భోజనం, వసతి డిస్కౌంట్ పై పొందే అవకాశం ఉంటుంది.

Also Read: బీఈ, బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఎన్‌ఎండీసీలో 67 ఉద్యోగాలు..?

https://apssdc.in/ వెబ్‌సైట్‌ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్కిల్ డెవలప్‌‌మెంట్‌ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి 7 రోజుల శిక్షణ ఇచ్చి కంపెనీలో ఉద్యోగం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 8వ తేదీన ఉదయం 9 నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు apssdc – sri city training facility, backside of sri city fire station, near govinda foods, sri city. అడ్రస్ లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది

Back to top button