విద్య / ఉద్యోగాలు

టెన్త్, ఇంటర్, ఐటీఐ వాళ్లకు శుభవార్త.. ఏపీలో 300 ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 300 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా జాబ్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 25వ తేదీ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ నెల 27వ తేదీన ఇంటర్వ్యూల నిర్వహణ జరుగుతుంది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు చిత్తూరు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.

మెషిన్ ఆపరేటర్ విభాగంలో 300 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పదో తరగతి పాసైన వాళ్లతో పాటు ఇంటర్, ఐటీఐ పాసైన వాళ్లతో పాటు ఫెయిలైన వాళ్లు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,300 రూపాయలు వేతనంగా లభిస్తుంది.

ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు సబ్సిడీపై ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి సదుపాయం, ఇతర ఆలవెన్స్ లు కూడా లభిస్తాయి. విజయవాడలోని లోహియా టవర్స్ లో ఈ ఇంటర్య్వూలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.apssdc.in/home/ లింక్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Back to top button