విద్య / ఉద్యోగాలువైరల్

నిరుద్యోగులకు శుభవార్త.. ఫోన్ పే కంపెనీలో ఉద్యోగాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జగన్ సర్కార్ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తోంది. తాజాగా apssdc నుంచి మరో ప్రకటన విడుదలైంది.

ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన ఫోన్ పే సంస్థ ఏపీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నియామకం చేపడుతోంది. ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బైక్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ నెల 25వ తేదీలోగా ఉద్యోగాల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

సేల్స్, మార్కెటింగ్ లో అనుభవం ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు పని చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 11,500 రూపాయలు వేతనం కాగా, ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ రూపంలో కంపెనీ అభ్యర్థులపై 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలో వైజాగ్ లో అత్యధికంగా 24 ఖాళీలు ఉన్నాయి.

విజయవాడ సెంట్రల్&ఈస్ట్ లో 7, విజయవాడ వెస్ట్ లో నాలుగు, వైఎస్సార్ కడపలో 2, పశ్చిమ గోదావరిలో 6, విజయనగరం, శ్రీకాకుళంలలో 8, రాజమండ్రిలో 2, ప్రకాశం జిల్లాలో 2, కర్నూల్ లో 2, కాకినాడలో 7, అనంతపూర్ లో 5, గుంటూరు అర్బన్ లో 2, చిత్తూరు, తిరుపతిలో రెండు ఖాళీలు ఉన్నాయి

Back to top button