విద్య / ఉద్యోగాలు

ఏపీలో 100 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

hand holding a megaphone, which offers great job

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. isuzu మోటార్స్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఈ ఉద్యోగాలకు రేపు గుంటూరులో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

అభ్యర్థులు ముందుగా https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారానే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా నీమ్స్ ట్రైనీ, డిప్లొమా & గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఎవరైతే నీమ్స్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తారో వాళ్లు ఐటీఐ చదివి ఉండాలి.

2018, 2019, 2020లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.8950 వేతనం లభిస్తుంది. డిప్లొమో, ఏదైనా డిగ్రీ, బీటెక్/బీఈ విద్యార్హత ఉన్నవాళ్లు డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ట్రైనీ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఎంపికైన అభ్యర్థులకు రూ.10 వేలు వేతనం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు synchro serve pmkk centre, d.no: 5-37-154, 2nd floor, ambati mansion, brodiepet, guntur అడ్రస్ కు హాజరు కావాల్సి ఉంటుంది

Back to top button