సినిమా వార్తలు

ఎ.ఆర్. రెహమాన్ ’99 సాంగ్స్’ ఎలా ఉందంటే..?

99 Songs Movie
కోట్లాది సంగీత ప్రియుల ఆదరాభిమానాలు అందుకున్న ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాగా రెహమాన్ తొలిసారి ఓ సినిమాకు కథ రాసి, తనే నిర్మించిన సినిమా ’99 సాంగ్స్’. ప్రేక్షకులలో ఆసక్తి నెలకొన్న ఈ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. మరి ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం.

ముందుగా కథ విషయానికి వస్తే.. జయ్ (ఇహాన్ భట్) కు సంగీతమంటే ప్రాణం. కానీ అతని తండ్రికి అది ఇష్టం ఉండదు. దాంతో తండ్రికి తెలియకుండానే సంగీత సాధన చేస్తూ.. సంగీతాన్ని నేర్చుకుంటాడు. అయితే జయ్… ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా (రంజిత్ బారోట్) కుమార్తె సోఫియా (ఎడిల్సీ వార్గాస్)తో ప్రేమలో పడటం, ఆమె తండ్రికి అది ఇష్టం లేకపోవడం, దాంతో ‘ఒక్క పాట కాదు సమాజాన్ని ప్రభావితం చేయగల వంద పాటలు తయారు చేసుకురమ్మని జయ్ కు ఛాలెంజ్ విసరడం.. దాంతో జయ్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మరి జయ్ చేసిన ఛాలెంజ్ ఏమిటి ? చివరకు జయ్ ఆశయం నెరవేరిందా? లేదా ? ప్రేమను గెలుచుకున్నాడా ? లేదా ? అన్నదే మిగతా సినిమా.

మొత్తమ్మీద సినిమా ఎలా ఉంటే.. స్లోగా సాగుతూ ఫీల్ లవ్ సీన్స్ తో.. మ్యాటర్ లేని ఎమోషనల్ సీన్స్ సినిమా బోర్ గానే ముగుస్తోంది. దానికి తోడు ఆర్టిస్టుల నుండి గొప్ప నటన రాబట్టుకోవడంలో, రెహమాన్ కథను ఆసక్తికరంగా చూపించడంలోనూ దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి సక్సెస్ కాలేదు. అయితే ఈ చిత్రం ఖచ్చితంగా ఒక వర్గం ప్రేక్షకులనే టార్గెట్ చేసుకుని తెరకెక్కినట్లు అనిపిస్తోంది. సంగీతం నేర్చుకునే నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం, ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాని దిగజార్చాయి.

Back to top button