జాతీయంప్రత్యేకంరాజకీయాలు

రాహుల్ కు మంచిరోజులు వస్తున్నాయా?

Are Rahul having good days?

Congress-BJP

ఓవైపు కరోనా ఉధృతి.. మరోవైపు పెట్రోల్ , నిత్యావసరాల ధరల పెరుగుదల.. ఇంకో వైపు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత.. వెరసి మోదీ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? దేశం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రకటనలు తప్ప పరిపాలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్న మోదీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..? ఏడేళ్లుగా తిరుగులేని పార్టీగా ముందుకు వెళ్తున్న బీజేపీకి గడ్డు పరిస్థితులు వచ్చాయా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి చూస్తే..దాదాపు సంవత్సరకాలంగా కరోనాతో ఊపిరాడకుండా సతమతమవుతున్న భారత్ ను ఇప్పుడున్న పాలక వర్గం చేతులెత్తేసిందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఆకలి కేకలు.. శవాల కుప్పలతో దేశ పరిస్థితి చాలా దారుణంగా తయారైందని పొరుగు దేశాలు సానుభూతిని ప్రకటిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందా..? ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందా..?

ఎన్నో ఆశలు.. ఎంతో నమ్మకంతో నరేంద్ర మోదీని దేశ ప్రజలు 2014లో అధికారంలో కూర్చొబెట్టారు. దేశాభివృద్ధి ఇక మోదీతో దశ మారనుందన్న కలలతో ఇండియన్స్ ఆశపడ్డారు. అయితే ఆరేళ్లుగా అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం.. అంటే సమయం రావాలి కదా.. అని వేచి చూశారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో.. ఆపద సమయంలో కూడా ప్రధాని ప్రజలను పట్టించుకోకపోవడంపై ఆయనపై ఇప్పుడు ప్రతిపక్షాలు కాకుండా సామాన్యులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారనేది చెప్పకనే చెప్పొచ్చు. అందుకేనేమో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా బెంగాల్ లో మోదీ స్ట్రాటజీ తెలిసిపోయింది.

ఇదిలా ఉండగా ఈ పరిస్థితులను కాంగ్రెస్ క్యాష్ చేసుకునే అవకాశం దక్కినట్లయింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీని నిలబెట్టక తప్పదనే ఆలోచనతో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఆలోచిస్తున్నాయి. గత రెండేళ్లుగా మోదీ-షాలు ఎన్ని ప్రణాళికలు వేసినా ప్రాంతీయ పార్టీల హవా సాగుతూనే ఉంది. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మోదీ స్వయంగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. దీనిని భట్టి మోదీ ప్రజలు ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో అర్థమవుతుందని అంటున్నారు.

ఈ సమయంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ కనీస సీట్లు కూడా గెలుచుకోలేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ మోదీ వ్యతిరేకతతో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు రాహుల్ చేసిన ట్వీట్లను చిన్న పిల్లాడిలా స్వీకరించినా ఇప్పుడు ఆయన ట్వీట్లకు స్పందన పెరిగింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నప్పుడు కాంగ్రెస్ పటిష్టం కోసం శ్రద్ధ పెడితే బీజేపీని గద్దె దించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Back to top button